కోలీవుడ్ ఇండస్ట్రీకి అక్కినేని కోడలు.. పవర్ ఫుల్ పాత్రలో కన్ఫర్మ్.. హీరో ఎవరంటే!

by Mallepaka Hamsa |   (  Updated:2025-09-29 15:18:54  IST  )

యంగ్ బ్యూటీ శోభిత ధూళిపాళ(Sobhita Dhulipala) ఎన్నో చిత్రాల్లో నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది.

కోలీవుడ్ ఇండస్ట్రీకి అక్కినేని కోడలు.. పవర్ ఫుల్ పాత్రలో కన్ఫర్మ్.. హీరో ఎవరంటే!
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ శోభిత ధూళిపాళ(Sobhita Dhulipala) ఎన్నో చిత్రాల్లో నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. మేజర్, పొన్నియన్ సెల్వన్-1, పొన్నియన్ సెల్వన్-2, మంకీ మ్యాన్ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. ఇక గత ఏడాది ‘లవ్ సితార’ చిత్రంతో ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత నుంచి సినిమాలకు దూరం అయింది. అక్కినేని నాగచైతన్య పెళ్లి చేసుకుని ఇంటి బాధ్యతలు తీసుకుని ఇండస్ట్రీకి కాస్త గ్యాప్ ఇచ్చింది. ఇదిలా ఉంటే.. తాజాగా, శోభిత ధూళిపాళ ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు పలు వార్తలు వస్తున్నాయి.

తమిళ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు టాక్. పా రంజిత్(Pa. Ranjit) దర్శకత్వంలో ‘వెట్టువం’(Vettuvam)లో శోభిత హీరోయిన్‌గా అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం. ఇందులో ఆమె ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నట్లు పలు పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. ఈ పాత్ర కోసం మూవీ టీమ్ శోభితను సంప్రదించగా.. గ్రీన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. షూటింగ్‌లోనూ పాల్గొంటున్నట్లు సమాచారం. ఆర్య హీరోగా నటిస్తున్న ఈ యాక్షన్ చిత్రాన్ని నీలం ప్రొడక్షన్స్, గోల్డెన్ రేషియో ఫిల్మ్స్ బ్యానర్స్‌పై పా. రంజిత్, పీయూష్ సింగ్, అభయానంద్ సింగ్, సౌరభ్ గుప్తా, అశ్విని చౌదరి, అదితి ఆనంద్ నిర్మిస్తున్నారు.

link

Next Story