రాఘవ లారెన్స్ ‘బుల్లెట్ బండి’ టీజర్ విడుదల చేయబోతున్న అక్కినేని హీరో.. పోస్ట్ వైరల్

by Mallepaka Hamsa |

రాఘవ లారెన్స్(Raghava Lawrence) డ్యాన్స్ కొరియోగ్రాఫర్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయి ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నారు.

రాఘవ లారెన్స్ ‘బుల్లెట్ బండి’ టీజర్ విడుదల చేయబోతున్న అక్కినేని హీరో.. పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: రాఘవ లారెన్స్(Raghava Lawrence) డ్యాన్స్ కొరియోగ్రాఫర్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయి ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నారు. ఆ తర్వాత దర్శకుడిగా మారి పలు చిత్రాలను సైతం తెరకెక్కించారు. నటుడిగానూ పలు మూవీస్ చేశారు. మల్టీ టాలెంట్స్‌తో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన రాఘవ లారెన్స్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ ఫుల్ బిజీ అయిపోయారు. ఆయన హీరోగా నటిస్తున్న సినిమాల్లో ‘బుల్లెట్ బండి’ ఒకటి. ఈ చిత్రానికి ఇన్నసి పాండియన్(Innasy Pandian) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీని ఫైవ్ స్టార్ క్రియేషన్స్ బ్యానర్‌పై కతిరేసన్ నిర్మిస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రారంభం కాగా.. ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ విడుదలై అందరిలో క్యూరియాసిటీని పెంచేశాయి. ఇందులోంచి ఇవి రెండు అప్డేట్స్ తప్ప మరేమి రాలేదు. దీంతో ప్రేక్షకులు నిరాశ చెందుతున్నారు. ఈనేపథ్యంలో.. తాజాగా, ‘బుల్లె్ట్ బండి’ రాబోతున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఆగస్టు 8న వరలక్ష్మి వ్రతం సందర్భంగా తెలుగు టీజర్‌ను ఉదయం 10:10గంటలకు అక్కినేని నాగచైతన్య లాంచ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ మూవీ మేకర్స్ ట్విట్టర్‌లో ఓ పోస్ట్ షేర్ చేశారు.

link

Next Story