- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నెల రోజుల్లోపే ఓటీటీలోకి అఖండ 2..ఎప్పుడు, ఎక్కడంటే ?
సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీన నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నద్ధం అవుతోందట

దిశ, వెబ్ డెస్క్: నందమూరి బాలయ్య లేటెస్ట్ గా నటించిన సినిమా అఖండ 2. బోయపాటి శ్రీను, నందమూరి బాలయ్య కాంబినేషన్ లో ఈ సినిమా వచ్చింది. డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ కావాల్సిన ఈ సినిమా డిసెంబర్ 12న రిలీజ్ అయింది. డిసెంబర్ 11వ తేదీన అర్ధరాత్రి నుంచే ప్రీమియర్లు పడిపోయాయి. దీంతో జనాలందరూ థియేటర్ల వద్ద క్యూ కట్టారు. చాలా థియేటర్లు హౌస్ ఫుల్ కూడా అయ్యాయి. ప్రస్తుతం థియేటర్లలో పెద్ద సినిమా లేకపోవడంతో అఖండ 2 మూవీకి వెళ్తున్నారు జనాలు. హిందుత్వం చుట్టూ ఈ సినిమా నడిచిన నేపథ్యంలో ఫ్యామిలీలు కూడా వెళ్తున్నాయి.
ఎస్ ఎస్ తమన్ మ్యూజిక్ అందించిన ఈ అఖండ 2 సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో, ఓటీటీ తేదీ వైరల్ గా మారింది. సినిమా రిలీజ్ అయిన నెల రోజులలోపే ఓటీటీలోకి వస్తుందని ప్రచారం జోరు అందుకుంది. సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీన నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నద్ధం అవుతోందట చిత్ర బృందం. సంక్రాంతి సమయంలో ఎక్కువ సినిమాలు వస్తున్న నేపథ్యంలో కాస్త ముందుగానే ఓటీటీలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.






