- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
400 మందికి ఒకే టాయిలెట్.. ప్రతిరోజు యుద్ధమే చేయాలంటున్న నటుడు
ప్రముఖ నటుడు అజాబ్ ఖాన్ రెండేళ్ల జైలు జీవితానుభవాలను అభిమానులతో షేర్ చేసుకున్నాడు.

X
దిశ, సినిమా: ప్రముఖ నటుడు అజాబ్ ఖాన్ రెండేళ్ల జైలు జీవితానుభవాలను అభిమానులతో షేర్ చేసుకున్నాడు. మాదకద్రవ్యాల కేసులో భాగంగా ఆర్థర్ రోడ్ జైలులో రెండేళ్ల శిక్ష అనుభవించిన అజాబ్ ఇటీవల విడుదలయ్యాడు. అయితే రీసెంట్‌గా ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్కడ ఎదురైన అనుభాలు, ఖైదీల జీవన విధానం గురించి వివరించాడు. ‘నేను వెళ్లిన జైలు అత్యంత రద్దీగా ఉంటుంది. నిజానికి 800 మంది ఖైదీలు ఉండే సామర్థ్యం కలిగివున్న జైలులో నిబంధనలకు విరుద్ధంగా 3,500 మంది అందులోనే జైలు శిక్ష అనుభవిస్తున్నారు. పడుకోవడం దగ్గరి నుంచి మొదలుపెడితే వాష్ రూమ్‌ల వరకూ ఓ యుద్ధ వాతావరణం ఉంటుంది. ఒకే టాయిలెట్‌ని 400 మంది వాడుతున్నారు. ఇక దాని పరిస్థితి ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి!’ అంటూ పలు విషయాలను గుర్తుచేసుకున్నాడు.
Read More: అమితాబ్ ఇంట్లో లింగ వివక్షత.. మనుమరాలి కామెంట్స్ వైరల్
Next Story






