‘Salaar’ మూవీ స్పెషల్ సాంగ్‌లో Aishwarya Rai..?

by Disha Web Desk 23 |
‘Salaar’ మూవీ స్పెషల్ సాంగ్‌లో Aishwarya Rai..?
X

దిశ, సినిమా: ప్రభాస్ నటిస్తున్న వరుస పాన్ ఇండియా చిత్రల్లో ‘సలార్’ ఒకటి. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ రెండు పార్ట్‌లుగా రానుంది. మొదటి పార్ట్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇకపోతే ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న మేకర్స్ మరో ఆలోచన చేస్తున్నారట. ఈ సినిమాకు కమర్షియల్‌గా మరింత హైప్ తీసుకొచ్చేందుకు ఒక స్పెషల్ సాంగ్‌ను ప్లాన్ చేస్తున్నారట. అంతేకాదు ఈ స్పెషల్ సాంగ్ కోసం ఏకంగా త్రిష లేదా ఐశ్వర్య రాయ్‌ని నటింపజేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీని గురించి అధికారిక ప్రకటన రావాల్సివుంది.

ఇవి కూడా చదవండి : Prabhas అభిమానులకు శుభవార్త.. త్వరలోనే ‘Salaar' Trailer..

Next Story

Most Viewed