'ఏజెంట్' సెన్సార్ పూర్తి

by Disha Web Desk 1 |
ఏజెంట్ సెన్సార్ పూర్తి
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న సినిమా 'ఏజెంట్'. స్పై థ్రిల్లర్‌ ట్రాక్ లో వస్తున్న ఈ మూవీలో అఖిల్ కు జంటగా సాక్షి వైద్య నటిస్తుంది. ఈ పెద్ద బడ్జెట్ యాక్షన్, థ్రిల్లర్ మూవీలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఏప్రిల్ 28, 2023న విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని యు/ఏ సర్టిఫికేట్ పొందినట్లు నిర్మాత అనిల్ సుంకర ట్విట్టర్ ద్వారా అధికారికంగా వెల్లడించారు. ప్రస్తుతం చిత్రబృందం తిరుపతిలో ప్రమోషన్‌లో ఉంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ కంపోజర్ హిప్ హాప్ తమిజా సంగీతాన్ని అందిస్తున్నారు.

Read More: మమ్ముట్టి తల్లికి సంతాపం తెలిపిన ‘ఏజెంట్’ టీమ్

Next Story

Most Viewed