Aditi Rao Hyderi - Siddharth: అదితి చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న లవర్ బాయ్ సిద్ధార్థ్.. ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుందా?

by Sujitha |
Aditi Rao Hyderi - Siddharth: అదితి చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న  లవర్ బాయ్ సిద్ధార్థ్.. ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుందా?
X

దిశ, సినిమా: అదితి రావు హైదరీ, లవర్ బాయ్ సిద్ధార్థ్ కొన్నాళ్లు డేటింగ్ చేశారు. రీసెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకుని అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. దీంతో వీరిద్దరూ ఇండస్ట్రీ క్రేజీ కపుల్ గా మారిపోయారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ హీరామండి సిరీస్ లో మెరిసింది. మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టింది. అయితే ఈ ప్రాజెక్ట్ నెట్ ఫ్లిక్స్ లో చూసిన కాబోయే భర్త రియాక్షన్ ఎలా ఉందనేది తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది అదితి. కాల్ చేసి ఎంతగా ఎమోషనల్ అయ్యాడో వివరించింది.

' ఈ సిరీస్ చూసిన సిద్ధు నాకు ఏడుస్తూనే వీడియో కాల్ చేశాడు. కళ్లు ఎర్రగా మారిపోయాయి. ఏం చెప్పలేక పోతున్నాడు. వెంటనే నేను నిన్ను, సంజయ్ సార్ ను కలవాలని చెప్పాడు. ఆ తర్వాత కాస్త సంభాలించుకుని జోక్ వేసాడు. అంటే మన ఫ్యామిలీలో ఇప్పుడు ఇద్దరూ ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు. ఒకరు భగత్ సింగ్ అయితే ఇంకొకరు బెబ్బో జాన్ అంటూ నవ్వేశాడు ' అని చెప్పుకొచ్చింది.

Next Story