ఇది చూశాక నాకు మాటలు రావడం లేదు.. దీనిని అస్సలు మిస్ అవ్వొద్దంటూ సూపర్ స్టార్ బ్యూటీ ట్వీట్

by Mallepaka Hamsa |

బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్(Ranveer Singh) ప్రధాన పాత్రలో నటించిన ‘ధురంధర్’(Dhurandhar) మూవీ బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టిస్తోంది.

ఇది చూశాక నాకు మాటలు రావడం లేదు.. దీనిని అస్సలు మిస్ అవ్వొద్దంటూ సూపర్ స్టార్ బ్యూటీ ట్వీట్
X

దిశ, సినిమా: బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్(Ranveer Singh) ప్రధాన పాత్రలో నటించిన ‘ధురంధర్’(Dhurandhar) మూవీ బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టిస్తోంది. అంతేకాకుండా కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా సినీ ప్రముఖల చేత ప్రశంసలు పొందుతోంది. ఇప్పటికే ఐకాన్ స్టార్ వంటి స్టార్స్ ‘ధురంధర్’ని ఆకాశానికెత్తేశారు. తాజాగా, సూపర్ స్టార్‌తో నటించిన ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న ప్రీతీ జింటా (Preity Zinta)ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టింది. ‘ధురంధర్’ చూసిన ఆమె భావోద్వేగానికి గురైంది. ‘‘ఈ రోజు చాలా సరదాగా గడిచింది. చాలా కాలం తర్వాత నేను ఒక్కదాన్ని థియేటర్‌లో సినిమా చూశాను. మధ్యాహ్నం షో హౌస్‌ఫుల్ అయింది. వావ్, అదొక అద్భుతమైన అనుభవం.

చాలా కాలంగా నేను చూసిన ఉత్తమ చిత్రాలలో ఇది ఒకటి. సహజంగా, వాస్తవికంగా ఉంది. హృదయాన్ని హత్తుకునే, ఉత్కంఠభరితమైన సంగీతం చాలా నచ్చింది. అన్నింటికన్నా ఎక్కువగా ఆదిత్య ధర్ దర్శకత్వం చాలా నచ్చింది. చాలా కష్టమైన పని.. అయినా కూడా ఎంతో హృదయంతో చేశారు. ఇది కేవలం ఒక సినిమా కాదు. మన దేశాన్ని రక్షించడానికి ప్రమాదంలో నిలబడిన ప్రతి అజ్ఞాత పురుషుడు, మహిళ, దేశభక్తుడికి ఇది ఒక ప్రేమలేఖలాంటిది. మూడున్నర గంటలు కనురెప్ప పాటులో గడిచిపోయాయి.

దీన్ని మళ్ళీ చూడటానికి సిద్ధంగా ఉన్నాను. ఆదిత్య ధర్ నాకు మాటలు రావడం లేదు. మాటలు వచ్చినప్పుడు నేను మీకు ఫోన్ చేసి, నాకెలా అనిపించిందో, ఈ కళాఖండాన్ని నేను ఎంతగా ప్రేమించానో చెబుతాను. అప్పటి వరకు నేను చెప్పేదొక్కటే, దీన్ని అస్సలు మిస్ అవ్వకండి మిత్రులారా థియేటర్స్‌కి వెళ్లి ‘ధురంధర్’ చూడండి .ఈ కళాఖండాన్ని సజీవంగా తీసుకువచ్చిన నటీనటులు, సాంకేతిక నిపుణుల బృందానికి పెద్ద అభినందనలు’’ అని రాసుకొచ్చింది.

link

Next Story