- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభాస్, ఎన్టీఆర్ తర్వాత తేజ సజ్జా క్రేజీ రికార్డు.. సంచలనం సృష్టిస్తున్న ‘మిరాయ్’
సూపర్ హీరో తేజ సజ్జా(Teja Sajja) చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు.

దిశ, సినిమా: సూపర్ హీరో తేజ సజ్జా(Teja Sajja) చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ నటించి మెప్పించాడు. ‘హనుమాన్’ సినిమాతో సూపర్ హిట్ సాధించి వరల్డ్ వైడ్‌గా ఊహించని క్రేజ్‌ను రాబట్టుకున్నాడు. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోలను మించి పోయేలా ఉన్నాడు అనడంలో అతిశయోక్తి లేదు. ఇక ఇటీవల ‘మిరాయ్’ (Mirai)చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. కార్తీక్ ఘట్టమనేని(Karthik Ghattamaneni) డైరెక్ట్ చేసిన ఈ సినిమా సెప్టెంబర్ 12వ తేదీ రిలీజ్ అయింది. మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమా సెకండ్ వీక్‌లో కూడా హౌస్ ఫుల్స్ తో సూపర్ కలెక్షన్స్ తో దూసుకు పోతోంది.
అన్ని భాషల్లో భారీ కలెక్షన్లు రాబడుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాలో రితిక నాయక్, మంచు మనోజ్, జగపతి బాబు, శ్రియ కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే 100 కోట్ల మార్క్ క్రాస్ చేసిన ఈ సినిమా 200 కోట్ల మార్కు దిశగా పరుగులు పెడుతోంది. తేజ సజ్జా కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలవనుంది మిరాయ్. తాజాగా ఈ సినిమా అమెరికాలో 2.5 మిలియన్ డాలర్స్ మార్క్ క్రాస్ చేసింది. అమెరికాలో ప్రభాస్, ఎన్టీఆర్ తర్వాత ఇలాంటి రికార్డు ఉన్న హీరోగా తేజ సజ్జా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఎన్నో సినిమాల తర్వాత ఎన్టీఆర్, ప్రభాస్ అలాంటి ఫీట్ సాధిస్తే, తేజా సజ్జా మాత్రం అతి తక్కువ సమయంలో .. తన సినీ కెరీర్ స్టార్టింగ్‌లోనే అలాంటి ఫీట్ సాధించి పాపులారిటీ పెంచుకున్నాడు.






