ఆ దర్శకుడిలో ఏదో మాయ ఉంది.. ఆయనతో పనిచేయాలంటే అదృష్టం ఉండాలి

by Disha Web Desk 10 |
ఆ దర్శకుడిలో ఏదో మాయ ఉంది.. ఆయనతో పనిచేయాలంటే అదృష్టం ఉండాలి
X

దిశ, సినిమా : బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ సంజయ్ లీలా భన్సాలీ ప్రాజెక్టులో నటించే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నానంటోంది అదితిరావు హైదరి. రీసెంట్‌గా ఓ సమావేశంలో పాల్గొన్న ఆమె.. నెట్ ఫ్లిక్స్ వేదికగా సంజయ్ లీలా తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్ ‘హీరామండి’లో భాగమవడం గురించి ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంది. ‘నేను సంజయ్ సర్‌ని అమితంగా ప్రేమిస్తున్నా. ఆయనను గొప్పగా ఆరాధిస్తాను. ఈ సిరీస్‌లో అతను లేకుండా ఒక్కపని కూడా జరగలేదు. ఆయనొక మ్యాజికల్ ఆర్టిస్ట్. కళాత్మకమైనది ఏదైనా సరే అందులో ఆయన గ్రేట్ మాస్టర్. ఆయనలో ఏదో మాయ ఉంది. నిజంగా నేను గౌరవించే వారితో కలిసి పనిచేయడాన్ని గర్వంగా ఫీల్ అవుతున్నా. ఒకరంగా ఆయన ఆశీర్వాదం పొందిన అదృష్టవంతురాలినే’ అంటూ దర్శకుడిపై ప్రశంసలు కురిపించింది. ఇక ఇందులో బాలీవుడ్ అగ్ర నటీమణులు సోనాక్షి సిన్హా, మనీషా కొయిరాల, రిచా చద్దా, శర్మిన్ సెహగల్, సంజీదా షేక్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Read More : ఆటోలోనే సెక్స్‌ చేయండి.. బోల్డ్ బ్యూటీ ముద్దులపై నెటిజన్లు ఫైర్.. వీడియో వైరల్

Vishwak Sen : విశ్వక్‌సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి’ ఫ‌స్ట్ గ్లింప్స్ రిలీజ్‌


Next Story