చిన్న పిల్లలా ఏడ్చా.. కెరీర్‌లో భావోద్వేగ క్షణాలను గుర్తుచేసుకుని అదితి ఎమోషనల్..!

by Disha Web Desk 19 |
చిన్న పిల్లలా ఏడ్చా.. కెరీర్‌లో భావోద్వేగ క్షణాలను గుర్తుచేసుకుని అదితి ఎమోషనల్..!
X

దిశ, సినిమా: బ్యూటిఫుల్ యాక్ట్రెస్ అదితిరావు హైదరి తన కెరీర్‌లో భావోద్వేగానికి గురైన క్షణాలను గుర్తు చేసుకుంటూ మరోసారి ఎమోషనల్ అయింది. రీసెంట్‌గా ముంబైలో నిర్వహించిన ‘ఓటీటీ ఇండియా ఫెస్ట్’లో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. తను నటించిన మలయాళ చిత్రం ‘సుఫియుమ్ సుజాతయుమ్’ అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అయినపుడు కన్నీరు పెట్టుకున్నట్లు తెలిపింది. ‘తమిళ్ మూవీ ‘సైకో’ విడుదలై భారీ విజయాన్ని అందుకున్న కొద్ది రోజులకే లాక్ డౌన్ ప్రకటించారు. ఆ తర్వాత మలయాళ మూవీ ‘సు..సు’ రిలీజ్ చేస్తున్నామని మూవీయూనిట్ చెప్పినప్పుడు భయపడ్డాను. అభిమానులు ఎలా ఆదరిస్తారోనని ఆందోళన చెందాను. కానీ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది. నాకు తెలియని వాళ్లు కూడా ఫోన్ చేసి ప్రశంసించారు. దీంతో నేను చిన్న పిల్లలా ఏడ్చాను’ అంటూ చెప్పుకొచ్చింది.

Next Story