Aditi Rao Hydari : కమల్ హాసన్, మణిరత్నం సినిమాలోకి అదితీరావు హైదరీ?

by Bhoopathi Nagaiah |   (  Updated:2023-10-30 14:25:58  IST  )

లోకనాయకుడు కమల్ హాసన్ ప్రజంట్ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు కమిట్ అవుతూ దూసుకుపోతున్నాడు.

Aditi Rao Hydari  : కమల్ హాసన్, మణిరత్నం సినిమాలోకి అదితీరావు హైదరీ?
X

దిశ, సినిమా: లోకనాయకుడు కమల్ హాసన్ ప్రజంట్ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు కమిట్ అవుతూ దూసుకుపోతున్నాడు. ప్రజంట్ ‘ఇండియన్ 2’ సినిమా పూర్తిచేసే పనిలో ఉండగా కమల్ తన తదుపరి చిత్రంకోసం లెజెండరీ దర్శకుడు మణిరత్నంతో పని చేయబోతున్నాడు. ఇది కమల్ కెరీర్‌లో 234వ చిత్రం. అయితే తాజాగా ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం హీరోయిన్ అదితీరావు హైదరీ నటించబోతున్నట్లు తెలుస్తోంది. అది కూడా కమల్ సోదరిగా అదితీరావు కనిపించబోతుందట. దీని గురించి అధికారికంగా ప్రకటన రావల్సివుంది.

Next Story