ఆసుపత్రిలో చేరిన దృశ్యం నటి.. ఇది నిజంగా కఠినమైన నెల అంటూ ఎమోషనల్ పోస్ట్ వైరల్

by Mallepaka Hamsa |

బాలీవుడ్ హీరోయిన్ ఇషితా దత్తా(Ishita Dutta) అందరికీ సుపరిచితమే. హిందీలో పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది.

ఆసుపత్రిలో చేరిన దృశ్యం నటి.. ఇది నిజంగా కఠినమైన నెల అంటూ ఎమోషనల్ పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: బాలీవుడ్ హీరోయిన్ ఇషితా దత్తా(Ishita Dutta) అందరికీ సుపరిచితమే. హిందీలో పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక తెలుగు ఇండస్ట్రీకి కూడా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ‘చాణక్యుడు’(Chanakyudu) సినిమాతో పాపులారిటీ దక్కించుకున్నప్పటికీ పెద్దగా అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ చెక్కేసింది. చివరగా ‘దృశ్యం-2’లో నటించింది. ఆ తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి దూరం అయింది. ఇక ఇషితా దత్తా పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. వరుస చిత్రాలతో కెరీర్ పీక్స్‌లో ఉండగానే బాలీవుడ్ నటుడు వత్సల్ సేథ్‌(Vatsal Seth)ను ఇషాతా దత్తా పెళ్లాడింది. వీరిద్దరికి ఓ కుమారుడు కూడా జన్మించాడు. ఈ ఏడాదిలో మరో బిడ్డకు కూడా స్వాగతం పలికింది. ఫిబ్రవరిలో ప్రెగ్నెంట్ అయిన విషయాన్ని ప్రకటించిన ఇషితా.. జూన్‌లో రెండో బిడ్డకు జన్మనిచ్చింది.

సోషల్ మీడియాలో యాక్టి్వ్‌గా ఉంటూ పలు పోస్టులు షేర్ చేస్తుంటుంది. తాజాగా, ఇషితా దత్తా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. తన కొడుకుతో పాటు ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నట్లు వెల్లడించింది. ‘‘ఇది నిజంగా కఠినమైన నెల... నా నవజాత శిశువుతో ఉండాల్సిన సమయంలో, నేను ఆసుపత్రి చుట్టూ తిరిగాను. అదృష్టవశాత్తూ, వాయు మరియు నేను ఇప్పుడు చాలా బాగున్నాము. మీలో చాలా మంది నా బరువు తగ్గడం గురించి నన్ను అడుగుతున్నారు - ఇది ఉద్దేశపూర్వకంగా కాదు, అనారోగ్యం కారణంగానే జరిగింది’’ అని రాసుకొచ్చింది. అంతేకాకుండా తన కొడుకుతో పాటు చేతికి బ్యాడేజ్ వేసుకున్న ఫొటోను షేర్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు ఆమెకు ధైర్యం చెబుతున్నారు.

Next Story