- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్యాన్సర్‌తో బాధపడుతున్న నటి దీపికా.. పరిస్థితి దారుణంగా ఉంది దయచేసి నాకోసం ప్రార్థించండి అంటూ ఎమోషనల్ పోస్ట్
ప్రముఖ టీవీ సీరియల్ నటి దీపికా కాకర్(Deepika Kakar) ‘నీర్ భరే తేరే నైనా దేవి’(Nir Bhare Tere Naina Devi) లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

దిశ, సినిమా: ప్రముఖ టీవీ సీరియల్ నటి దీపికా కాకర్(Deepika Kakar) ‘నీర్ భరే తేరే నైనా దేవి’(Nir Bhare Tere Naina Devi) లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత పలు సీరియల్స్ చేసి తన పాపులారిటీని పెంచుకుంది. అంతేకాకుండా పలె సెలబ్రిటీ మాస్టర్ చెఫ్‌లలో కనిపించి సందడి చేసింది. ఇక రియాలిటీ షో బిగ్‌బాస్‌లోనూ పాల్గొంది. వరుస సీరియల్స్‌లో కెరీర్ పీక్స్‌లో ఉండగా షోయబ్ ఇబ్బహీంను పెళ్లి చేసుకుంది. ఇక అంతా బాగుంది అనుకునే సమయంలో దారుణ పరిస్థితులు ఎదురయ్యాయి. తాజాగా, ఈ విషయాన్ని తెలుపుతూ దీపికా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘‘గత కొన్ని వారాలుగా గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాను.
నా కడుపు పైభాగంలో విపరీతమైన నొప్పి రావడంతో ఆసుప్రతుల చుట్టూ తిరగాను. వైద్య పరీక్షల్లో కాలేయంలో టెన్నిస్ బాల్ అంత కణితిని వైద్యులు గుర్తించారు. ఆ కణితి ప్రమాదకర దశలో ఉంది. స్టేజ్-2 దశలో ఉన్న క్యాన్సర్‌గా వైద్యులు నిర్ధారించారు. ఈ ప్రాణాంతక లివర్ క్యాన్సర్‌ను ధైర్యంగా ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాను. దైవబలం, అభిమానుల ఆశీర్వాదాలు, ఆదరణతో ఈ ప్రమాదాన్ని విజయవంతంగా అదిగమిస్తాను. దయచేసి నాకోసం మీరంతా ప్రార్థించండి’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు ఆమెకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు.






