సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన నటుడు వీడియోలు.. క్లారిటీ ఇస్తూ షాకింగ్ కామెంట్స్

by Mallepaka Hamsa |

గత రెండు రోజులుగా ప్రముఖ నటుడు అజ్మల్ అమీర్‌(Ajmal Amir) అమ్మాయిలతో అసభ్యంగా మాట్లాడాడంటూ ఓ వీడియో క్లిప్పింగ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన నటుడు వీడియోలు.. క్లారిటీ ఇస్తూ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: గత రెండు రోజులుగా ప్రముఖ నటుడు అజ్మల్ అమీర్‌(Ajmal Amir) అమ్మాయిలతో అసభ్యంగా మాట్లాడాడంటూ ఓ వీడియో క్లిప్పింగ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వారితో హద్దులు దాటి మాట్లాడినట్లు పలు పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. తాజాగా, అజ్మల్ సోషల్ మీడియా ద్వారా స్పందించి క్లారిటీ ఇచ్చాడు. ‘‘గత రెండు రోజులుగా నాకు సంబంధించిన వైరల్ అవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఈ కల్పిత కథనాలు, ఏఐ వాయిస్ ఇమిటేటింగ్, ఎడిటింగ్స్.. నన్ను కానీ నా కెరీర్‌ను కానీ నాశనం చేయలేవు.

దేవుడి దయవల్ల రెండు పెద్ద ఇండస్ట్రీలలో నేనేంటో నిరూపించుకోగలిగాను. నాకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుని సినీ పరిశ్రమలో కొనసాగుతున్నాను. నా ఇమేజ్‌ను కాపాడేందుకు నాకెటువంటి మేనేజర్ లేడు. పీఆర్ అసలే లేడు. రెండురోజులుగా నా గురించి తప్పుడు ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో నాకు అండగా నిలబడ్డ అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. మీరే నా ధైర్యం’’ అని చెప్పుకొచ్చారు. దీంతో అజ్మల్‌పై వస్తున్న వార్తలకు చెక్ పడినట్లు అయింది.

Next Story