- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యూట్యూబ్‌లోకి రాబోతున్న ఆమిర్ ఖాన్ ‘సితారే జమీన్ పర్’.. బిగ్ ట్విస్ట్ ఇస్తూ పోస్ట్.. ఎప్పటినుంచి రానుందంటే?
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్(Aamir Khan) ఓ వైపు వరుస సినిమాల్లో నటిస్తూనే నిర్మాతగానూ రాణిస్తున్నారు.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్(Aamir Khan) ఓ వైపు వరుస సినిమాల్లో నటిస్తూనే నిర్మాతగానూ రాణిస్తున్నారు. ఆయన ఇటీవల ‘సితారే జమీన్ పర్’(Sitare Zameen Par) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆర్.ఎస్ ప్రసన్న కుమార్ (Prasanna Kumar)దర్శకత్వంలో వచ్చిన ఈ కామెడీ అండ్ స్పోర్ట్స్ డ్రామాగా వచ్చి బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించింది. ఈ సినిమాను ఆమిర్ ఖాన్, అపర్ణ పూరోహిత్ నిర్మించారు. ఈ చిత్రం హిట్ ‘తారే జమీన్ పర్’ సీక్వెల్‌గా వచ్చి మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఇక ఇందులో ఆమిర్ ఖాన్, జెనీలియా జంటగా నటించారు. అయితే ఈ మూవీ విడుదల సమయంలో గందరగోళం ఏర్పడింది. థియేటర్స్‌లోకి కాకుండా యూట్యూబ్‌లో రిలీజ్ చేస్తారని పలు వార్తలు వచ్చాయి.
కానీ జూన్ 20న ‘సితారే జమీన్ పర్’ బిగ్ స్క్రీన్‌పైకి వచ్చి ప్రేక్షకులను కట్టిపడేసింది. దీంతో సినీ ప్రియులంతా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘సితారే జమీన్ పర్’ మూవీ ఓటీటీలోకి కాకుండా డైరెక్ట్ యూట్యూబ్‌లోకి రాబోతున్నట్లు సమాచారం. కానీ ఇందులో ఓ ట్విస్ట్ ఉంది. యూట్యూబ్‌లో పే-పర్-వ్యూ మోడల్‌లో విడుదల కానుంది... ఆగస్టు 1 నుండి 100 రూపాయల ధరకు ప్రీమియర్ ప్రారంభమవుతుందని టాక్. ఇందులో నిజమెంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.






