బిచ్చగాడు అనుకొని సూపర్ స్టార్‌కు 10 రూపాయలు దానం చేసిన మహిళ

by Disha Web Desk 9 |
బిచ్చగాడు అనుకొని సూపర్ స్టార్‌కు 10 రూపాయలు దానం చేసిన మహిళ
X

దిశ, వెబ్‌డెస్క్: రజనీకాంత్ హీరోగా నటించిన సూపర్ హిట్ ‘జైలర్’ చిత్రానికి దాదాపు సీక్వెల్ కూడా కన్ఫామ్ అయ్యింది. ఇక షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. థియేటర్లలోకి ఎప్పుడు వస్తుందని జనాలు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ హీరో గురించి ఓ ఆసక్తికర వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ‘రజనీకాంత్’ ను చూసి ఓ మహిళ 10 రూపాయలు దానం చేసిందట. 2007లో శివాజీ చిత్రం రిలీజైన తర్వాత ఈ హీరో దేవుడిని దర్శించుకోవడానికి మారు వేషంలో గుడికి వెళ్లారు. రజనీ వృద్ధుడిలా కనిపించడంతో ఎవరూ హీరో అని గుర్తుపట్టలేకపోయారట. ఒక మహిళ ఈ హీరో దగ్గరకు వచ్చి పది రూపాయలు ఇవ్వగానే.. ఆమెను ఏమి అనకుండా అవి తీసుకుని, దేవుని హుండీలో వేశారట.

తర్వాత ఈయన కారు ఎక్కడాన్ని గమనించిన ఆమె.. వెంటనే రజనీ దగ్గరకు వెళ్లి క్షమాపణలు కోరి.. 10 రూపాయలు వెనక్కి ఇవ్వాలని కోరిందట. ‘ప్రతిసారి దేవుడు తన ముందు నేనొక బిచ్చగాడిని అని ఏదో ఒక విధంగా గుర్తు చేస్తుంటాడు. ఆ దేవుడు ఆడిన నాటకంలో మీరు ఒక సాధనం అని రజనీకాంత్ చెప్పాడట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి: మళ్లీ అడ్డంగా బుక్ అయిన Naga Chaitanya-Sobhita!



Next Story

Most Viewed