- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రియుడిని పెళ్లి చేసుకుని షాకిచ్చిన టాలీవుడ్ హీరోయిన్..వీడియో వైరల్
పలు ఆల్బమ్ సాంగ్స్‌తో యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది నుపుర్ సనన్.. తనదైన అందం, అమాయకమైన లుక్స్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

దిశ, సినిమా: పలు ఆల్బమ్ సాంగ్స్‌తో యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది నుపుర్ సనన్.. తనదైన అందం, అమాయకమైన లుక్స్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సింగర్‌గా మాత్రమే కాకుండా, నటిగా కూడా తన టాలెంట్‌ను నిరూపించుకోవాలనే ఆశతో సినిమాల వైపు అడుగులు వేసింది. ఆ క్రమంలోనే రవితేజ సరసన ‘టైగర్ నాగేశ్వర రావు’ సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయమైంది. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించకపోయినా.. నుపుర్ స్క్రీన్ ప్రెజెన్స్, గ్లామర్, నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.
దీంతో పరిశ్రమలో ఆమెపై నెమ్మదిగా పాజిటివ్ బజ్ ఏర్పడింది. ఈ క్రేజ్‌తోనే నుపుర్‌కు బాలీవుడ్ నుంచి ఆఫర్ రావడం విశేషం. ‘నూరని చెహ్రా’ సినిమాతో హిందీలో హీరోయిన్‌గా అడుగుపెట్టబోతోందని సమాచారం. ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ రెండింటిలోనూ అవకాశాలు అందుకుంటూ కెరీర్ పరంగా ఫుల్ ఫామ్‌లో ఉన్న సమయంలోనే నుపుర్ వ్యక్తిగత జీవితంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది. కొంతకాలంగా సింగర్ స్టెబిన్ బెన్‌తో ప్రేమలో ఉన్న నుపుర్.. ఈ విషయాన్ని చాలా కాలం గోప్యంగా ఉంచింది. అయితే ఇటీవల వీరి నిశ్చితార్థం జరగడంతో ఈ ప్రేమ విషయం బయటకు వచ్చింది.
నిశ్చితార్థం తర్వాత పెళ్లికి ఎక్కువ గ్యాప్ లేకుండా.. నేరుగా పెళ్లి పీటలెక్కి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. రాజస్థాన్‌లోని అందమైన ఉదయ్‌పూర్‌లో సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక ఈ పెళ్లి వేడుకలో నుపుర్ సంప్రదాయ వేషధారణలో ఎంతో అందంగా మెరిసింది. స్టెబిన్ బెన్‌తో కలిసి ఆమె దిగిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ జంటను చూసిన నెటిజన్లు మొదట షాక్‌కు గురైనా.. కంగ్రాట్స్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.






