ఎంతో మంది అమ్మాయిలతో ఎఫైర్ పెట్టుకున్న స్టార్ నటుడు

by Disha Web Desk 9 |
ఎంతో మంది అమ్మాయిలతో ఎఫైర్ పెట్టుకున్న స్టార్ నటుడు
X

దిశ, వెబ్‌డెస్క్: అర్ణన్, దివ్య అనే బుల్లితెర సెలబ్రిటీలిద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ జంట వివాదం రోజు రోజుకు మరింత ఎక్కువవుతూనే ఉంది కానీ తగ్గడం లేదు. దివ్య గర్భం దాల్చడంతో తనను దూరం పెట్టాడని, సరిగ్గా మట్లాడడం లేదని, అంతేకాకుండా మరొక నటితో ఎఫైర్ పెట్టుకున్నాడని గతంలో అర్ణన్‌పై ఆమె పోలీసులకు కంప్లైంట్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే ప్రెగ్నెన్సీ సమయంలోనే తనకు డివోర్స్ ఇస్తానని ప్రకటించాడు. దివ్య ఇటీవలే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు.

తాజాగా ఆమె ఓ ఇంటర్య్వూలో హాజరై అర్ణన్ గురించి పలు ఆసక్తికర విషయాలు బయట పెట్టారు. ‘‘డబ్బుల కోసం తనను తాను ఒక గేగా ఒక పైలట్‌తో పరిచయం పెంచుకున్నాడు. అతడి దగ్గర మనీ తీసుకుని మోసం చేయడమే కాకుండా ఆయన చావుకు కూడా కారణమయ్యాడు. అలాగే ఎంతో మంది అమ్మాయిలను మోసం చేశాడని’’ ఆడియో క్లిప్స్, గర్ల్స్‌తో చాటింగ్ చేసిన స్ర్కీన్ షార్ట్స్‌తో సహా ఇంటర్వ్యూలో ఆమె చూపించారు. మరోకవైపు ‘చెల్లమ్మ’ సీరియల్ నటి అన్షితతో కూడా అర్ణన్ అఫైర్ పెట్టుకున్నాడని ఎమోషనల్ అవుతూ వెల్లడించారు.

Also Read: Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్ పరువు తీసిన మేనేజర్.. అసలేం జరిగిదంటే?

Next Story

Most Viewed