- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘కాంచన-4’లో ఆఫర్ కొట్టేసిన రైజింగ్ స్టార్.. ఆ హీరోకు ఎప్పటికీ రుణపడి ఉంటానంటూ కామెంట్స్
తన అందం, అభినయంతో కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టిస్తున్న బ్యూటీ మీరా రాజ్(Meera Raj).

దిశ, సినిమా: తన అందం, అభినయంతో కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టిస్తున్న బ్యూటీ మీరా రాజ్(Meera Raj). చిన్న వయసులోనే సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె, తొలి చిత్రంతోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. గ్లామర్‌కే పరిమితం కాకుండా నటనలోనూ తనకంటూ ప్రత్యేక ఫేమ్ సంపాదించుకుంటూ రైజింగ్ స్టార్‌గా మారిపోయింది. అంతేకాకుండా సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ ఫాలోవర్స్‌ను పెంచుకుంటూ ఉంటుంది. అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకుని క్రేజీ బ్యూటీగా కొనసాగుతోంది. ఇక ఇటీవల మీరా రాజ్ నటించిన ‘సన్‌ఆఫ్’ చిత్రం మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఉత్తరాది నుంచి వచ్చినప్పటికీ ఈ సినిమా కోసం స్వయంగా తెలుగులో డబ్బింగ్ చెప్పుకోవడంతో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈనేపథ్యంలో.. తాజాగా, మీరా రాజ్ ఓ గుడ్ న్యూస్ వెల్లడించింది. ‘కాంచన-4’ (Kanchana-4)అవకాశం దక్కించుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది. రాఘవ లారెన్స్(Raghava Lawrence) దర్శకత్వంలో రాబోతున్న ఈ ప్రతిష్ఠాత్మక పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో మీరాకు కీలక పాత్రలో కనిపించనుంది.
కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించే లారెన్స్ ఆమెకు ఈ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై మీరా స్పందిస్తూ.. ‘‘నాపై నమ్మకం ఉంచి ఈ పాత్రను ఇచ్చినందుకు లారెన్స్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఆయన సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నా శక్తినంతా పెట్టి పనిచేస్తున్నాను’’ అని చెప్పుకొచ్చింది. కాగా.. ఈ సినిమా కాంచన హారర్ కామెడీ ఫ్రాంచైజీలో నాలుగో భాగంగా రాబోతుంది. ఇందులో పూజా హెగ్డే, డ్యాన్సింగ్ క్వీన్ నోరా ఫతేహి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ షూటింగ్ దాదాపు తుది దశలో ఉన్నట్లు టాక్. లారెన్స్ తనదైన శైలిలో భయం, నవ్వు, యాక్షన్ కలగలిపిన కథనంతో మరో బ్లాక్ బస్టర్‌ను అందించేందుకు సిద్ధమవుతున్నారు. పాన్ ఇండియా లెవెల్‌లో రాబోతున్న ఈ సినిమాకు లారెన్స్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది.






