- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అరుదైన ప్రేమ కథ.. బ్యూటిఫుల్ మూవ్‌మెంట్స్‌తో ‘కపుల్ ఫ్రెండ్లీ’ ఆకట్టుకుంటుంది
ప్రేమంటే ప్రేమలో పడిపోవడం కాదు. ప్రేమించిన వారిని నిలబెట్టడం. రియాల్టీకి దగ్గరగా ఉండే చిత్రమిది.

దిశ, సినిమా: సంతోష్ శోభన్(Santosh Shobhan),మానస వారణాసి (Manasa Varanasi)జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కపుల్ ఫ్రెండ్లీ’(Couple friendly). యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా నిర్మిస్తోంది. అజయ్ కుమార్ రాజు.పి కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తుండగా.. మ్యూజికల్ రొమాంటిక్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమా వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రాన్ని ప్యాషనేట్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని ఏపీ, తెలంగాణలో రిలీజ్ చేస్తున్నారు. తాజాగా, ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ.. మనకు ఈ మధ్య లవ్ స్టోరీస్ తగ్గిపోయాయి. ఈ టైమ్ లో వస్తున్న అరుదైన ప్రేమ కథ ఇది.
ప్రేమంటే ప్రేమలో పడిపోవడం కాదు. ప్రేమించిన వారిని నిలబెట్టడం. రియాల్టీకి దగ్గరగా ఉండే చిత్రమిది. ఈ సినిమా నేను చూసి నచ్చి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. ఈ రోజు పది చోట్ల ప్రీమియర్స్ వేస్తున్నాం. మూవీ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. సక్సెస్ మీట్ లో మళ్లీ కలుద్దాం’’ అన్నారు. హీరో సంతోష్ శోభన్ మాట్లాడుతూ.. కపుల్ ఫ్రెండ్లీ ఒక డీప్లీ ఎమోషనల్ మూవీ, సింపుల్ బ్యూటిఫుల్ మూవ్ మెంట్స్ తో ఆకట్టుకుంటుంది. మంచి క్యారెక్టర్స్, ఎమోషన్, హ్యూమర్ ఉన్న చిత్రమిది. ఈ నెల 14 నుంచి మా మూవీతో ఎమోషన్‌ను కూడా ఫీల్ అవుదాం. ధీరజ్ మా టీమ్ లోకి రావడం హ్యాపీ. యూవీలో వచ్చే ప్రతి సినిమా మాదే అనుకుంటా. ఇది ఒక ఫ్యామిలీ లాంటి సంస్థ నాకు. మానస ప్రతిభ గల నటి. మా మూవీ చూశాక మీరంతా ఇదే విషయాన్ని చెబుతారు. థియేటర్స్ లో మీ అందరినీ కలుస్తా అని చెప్పారు.






