సాయి పల్లవికి అరుదైన గౌరవం..

by Mallepaka Hamsa |

తమిళనాడులో అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన ‘కలైమామణి’ అవార్డులను తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రదానం చేశారు.

సాయి పల్లవికి అరుదైన గౌరవం..
X

దిశ, సినిమా: తమిళనాడులో అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన ‘కలైమామణి’ అవార్డులను తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రదానం చేశారు. కళా రంగంలో విశేష కృషి చేసిన వారికి ఈ అవార్డు లభించింది. గత మూడేళ్లుగా ఈ అవార్డులను ప్రకటించలేదు. ఇక ఇటీవల 2021, 2022, 2023లో విశేష స్పందన సాధించిన వారి పేర్లు వెల్లడించారు. ఇందులో భాగంగా నటి సాయి పల్లవి(Sai Pallavi)కి అరుదైన ఘనత దక్కింది. 2021 సంవత్సరానికి గానూ అవార్డు సొంతం చేసుకుంది. అలాగే సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌(Anirudh Ravichander)కు 2023 సంవత్సరానికి గానూ ఈ పురస్కారం లభించింది. కలైమామణి(Kalaimamani) అవార్డు గ్రహీతలకు సీఎం స్టాలిన్ మూడు సవర్ల బంగారు పతకం, ప్రశంసా పత్రం అందజేశారు. ఇక వీరితో పాటు ఎస్ జె సూర్య, దర్శకుడు లింగుస్వామి, విక్రమ్ ప్రభు, మణికందన్ వంటి ప్రముఖులు ఈ అవార్డును అందుకున్నారు. మూడేళ్లకు గానూ మొత్తం 90 మందికి పురస్కారాలు అందజేశారు.

Next Story