- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒక్కరోజుకు ఎంత తీసుకుంటావంటూ నెటిజన్ పోస్ట్.. హీరోయిన్ ఊహించని రిప్లైతో సోషల్ మీడియా షేక్ !
మలయాళ ముద్దుగుమ్మ సనా ఆల్తఫ్(Sana Altaf)కు ఊహించని అనుభవం ఎదురైంది.

దిశ, సినిమా: మలయాళ ముద్దుగుమ్మ సనా ఆల్తఫ్(Sana Altaf)కు ఊహించని అనుభవం ఎదురైంది. సోషల్ మీడియా ద్వారా ఓ నెటిజన్ ఆమెను డేటింగ్‌కు రమ్మని ఆఫర్ ఇచ్చాడు. వీలైనప్పుడు చెప్తే సనాను దుబాయ్ లేదా మాల్దీవులకు తీసుకెళ్తానని పలు పోస్టులు పెడుతున్నాడు. తాజాగా, ఈ విషయాన్ని తెలుపుతూ.. సనా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ పోస్ట్ పెట్టింది. అంతేకాకుండా అసలు విషయాన్ని రివీల్ చేసింది. డేట్‌కి రమ్మని తనకు ఓ వ్యక్తి పదే పదే మెసేజ్ చేస్తున్నాడని చెప్తూ స్క్రీన్‌షాట్స్ పెట్టింది. అసలు అందులో ఏముందో ఇక్కడ తెలుసుకుందాం.. ‘‘డియర్ సనా.. ఎలా ఉన్నావు. నేను చెన్నైకి చెందిన వ్యాపారవేత్త, పారిశ్రామికవేత్త బాలాజీని. నాకు నీతో డేట్‌కి వెళ్లాలని ఉంది. దానికి నువ్వు ఎంత తీసుకుంటావో చెప్పు.
అలాగే నీకు ఎప్పుడు వీలవుతుందో చెప్పు. దాన్ని బట్టి మనం డేట్ ప్లాన్ చేసుకుందాం. ఇండియాలో లేదంటే మాల్దీవులు, దుబాయ్ వంటి ప్రదేశాలకు వెళ్దాం. ఒకసారి నా గురించి ఆలోచించు’’ అని రాసుకొచ్చాడు. ఇక దీనికి సనా ఊహించని రిప్లై ఇవ్వడంతో సోషల్ మీడియా షేక్ అవుతోంది. ‘‘ఎంత ప్రొఫెషనల్‌గా, రొమాంటిక్‌గా ప్రపోజ్ చేశాడో’’ అనడంతో అంతా షాక్ అవుతున్నారు. ఎవరైనా ఇలాంటి మెసేజ్‌లు చేస్తే సీరియస్ అవుతారు కానీ ఇలాంటి రిప్లై ఇవ్వడమేంటని ఆశ్చర్యపోతున్నారు. కాగా.. సనా.. ‘విక్రమాదిత్య’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత మలయాళ స్టార్ దుల్కర్ సల్మా్న్ చెల్లేలిగా నటించింది. దీంతో ఒక్కసారిగా అమ్మడు ఫాలోయింగ్ పెరిగిపోయింది. వెంటకే ‘మరియం ముక్క’ మూవీలో హీరోయిన్‌గా చాన్స్ దక్కించుకుంది. అలా తమిళ, మలయాళ భాషల్లో వరుస అవకాశాలు అందుకుంటూ పలు చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకుల్లో తన పాపులారిటీని పెంచుకుంటుంది.






