- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మగవాడిలా మారుతున్నావంటూ నెటిజన్ కామెంట్.. స్ట్రాంగ్‌గా ఇచ్చిపడేసిన నటి కూతురు (పోస్ట్)
ఇటీవల సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ట్రోలింగ్ హద్దులు దాటుతోంది.

దిశ, సినిమా: ఇటీవల సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ట్రోలింగ్ హద్దులు దాటుతోంది. సెలబ్రిటీలనే కాదు… వారి కుటుంబ సభ్యులను, పిల్లలను కూడా వదలకుండా టార్గెట్ చేస్తూ నెటిజన్లు దారుణమైన కామెంట్లు చేస్తున్నారు. మాటలతో గాయపరిచే ఈ ట్రోలింగ్‌పై కొందరు స్ట్రాంగ్‌గా రియాక్ట్ అవుతుంటే, మరికొందరు మాత్రం నిశ్శబ్దంగా వదిలేస్తున్నారు. ఇంకొందరు మాత్రం చట్టపరమైన చర్యలకు వెళ్లి ట్రోలర్స్‌కు గట్టి హెచ్చరికలు ఇస్తున్నారు. ఈ తరహా ఘటనలు రోజురోజుకీ పెరిగిపోతుండటం ఆందోళన కలిగించే విషయం. ఈక్రమంలో.. తాజాగా మలయాళ నటి మంజు పిళ్లై కూతురు దయపై జరిగిన ట్రోలింగ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఓ నెటిజన్ దయను ఉద్దేశించి “రోజురోజుకీ మగాడిలా తయారవుతున్నావు” అంటూ అసభ్యంగా కామెంట్ పెట్టాడు. ఈ మాటలు చూసిన మంజు పిళ్లై కూతురు ఊరుకోలేదు. ట్రోలర్‌కు గట్టిగా బదులిస్తూ సోషల్ మీడియా ద్వారా ఓ వీడియోను షేర్ చేసి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
ఈ వీడియోలో దయ మాట్లాడుతూ, “నాలో మగతనం ఉందని, జిమ్‌కి వెళ్తే పూర్తిగా మగాడినైపోతానని ఓ వ్యక్తి అన్నాడు. నాలో ఉన్న ఈ మగతనం నీకు అసౌర్యం కలిగిస్తే సారీ. కానీ నాలోని ఈ మగతనాన్ని అంగీకరించేంత పౌరుషం మీకు లేకపోవడం నిజంగా బాధాకరం. మీరు నాకంటే పెద్ద మగాడినని ఒప్పుకునేంత ధైర్యం కూడా లేకపోవడం విచారకరం” అంటూ సూటిగా ప్రశ్నించింది. దయ ఇచ్చిన ఈ స్ట్రాంగ్ రిప్లైకి నెటిజన్ల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. చాలా మంది ఆమె ధైర్యాన్ని ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు. “ఇదే సరైన సమాధానం”, “ట్రోలర్స్‌కు ఇలాగే బుద్ధి చెప్పాలి” అంటూ అభిమానులు స్పందిస్తున్నారు. ముఖ్యంగా మహిళలపై, పిల్లలపై చేసే అనవసర వ్యాఖ్యలకు ఇది గట్టి హెచ్చరికగా మారిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.






