చిరంజీవితో సినిమా అంటే నరకమే.. కాజల్ కామెంట్స్ వైరల్

by Disha Web Desk 7 |
చిరంజీవితో సినిమా అంటే నరకమే.. కాజల్ కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా: ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వారిలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. తన అద్భుతమైన నటనతో ఎంతో మంది హీరోలకు స్ఫూర్తిగా నిలిచాడు. ఇక చిరంజీవితో నటించడం.. ఆయనతో కలిసి డ్యాన్స్ చేయడం అంటే హీరోయిన్లకు ఒక సవాల్ అనే చెప్పాలి. ఇక ఇప్పటి వరకు చిరుతో జతకట్టిన హీరోయిన్స్‌లో కాజల్ అగర్వాల్ కూడా ఒకరు. చిరంజీవి నటించిన ‘ఖైదీ నెంబర్ 150’లో నటించిన బ్యూటీ.. కొద్దికాలం షూటింగ్ కంప్లీట్ అయ్యాక ‘ఆచార్య’ మూవీ నుంచి తప్పుకుంది.

ఇదిలా ఉంటే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ చందమామ.. చిరంజీవి గురించి వైరల్ కామెంట్స్ చేసింది. ‘నేను ఎంతో మంది హీరోలతో డ్యాన్స్ చేశాను. కానీ చిరంజీవితో డ్యాన్స్ చేయడం అంటే కాస్త భయం వేసేది. అంతేకాదు ఆయన ఎలాంటి షాట్ అయినా సింగిల్ టేక్‌లో పూర్తి చేస్తారు. కానీ నేను సుమారు ఏడు టేకుల వరకు తీసుకునే దాన్ని. ఆ సమయంలో ఆయన ఏమైనా అంటారేమోననే భయంతో నరకం అనుభవించేదాన్ని’ అంటూ చెప్పుకొచ్చింది కాజల్. కాగా ప్రజంట్ ఈ అమ్మడు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.


Next Story

Most Viewed