మాస్ మహారాజాతో భారీ ప్రాజెక్ట్.. ట్వీట్‌తో క్లారిటీ ఇచ్చిన హరీష్ శంకర్

by Mallepaka Hamsa |

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్(Harish Shankar) ‘ఉస్తాద్ భగత్ సింగ్’(Ustad Bhagat Singh) తెరకెక్కిస్తున్నారు.

మాస్ మహారాజాతో భారీ ప్రాజెక్ట్.. ట్వీట్‌తో క్లారిటీ ఇచ్చిన హరీష్ శంకర్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్(Harish Shankar) ‘ఉస్తాద్ భగత్ సింగ్’(Ustad Bhagat Singh) తెరకెక్కిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా నటిస్తున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కొన్ని రోజులు వాయిదా పడ్డ షూటింగ్ ఇటీవల మళ్లీ పున:ప్రారంభం అయింది. షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ చిత్రం నుంచి వరుస అప్డేట్స్ విడుదలవుతూ మంచి రెస్సాన్స్‌ను దక్కించుకుంటున్నాయి. ఇదిలా ఉంటే.. గత కొద్ది కాలంగా హరీష్ శంకర్ మాస్ మహారాజా రవితేజతో ఓ ప్రాజెక్ట్ చేయనున్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా, ఈ విషయంపై హరీష్ శంకర్ స్పందించి క్లారిటీ ఇచ్చారు. ‘‘నా తదుపరి ప్రాజెక్ట్ గురించి వస్తున్న వివిధ వార్తలన్నీ పూర్తిగా ఊహాజనితమైనవే. నేను అధికారిక ప్రకటన ద్వారా సరైన సమయంలో వివరాలను వ్యక్తంగతంగా పంచుకుంటాను. ప్రస్తుతానికి నేను, నా టీమ్ అంతా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాతో చాలా బిజీగా ఉన్నాము’’ అని రాసుకొచ్చారు.

link

Next Story