- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
42 నిబంధనల రచ్చ.. అల్లు అర్జున్ ప్రవర్తనపై రాజశేఖర్ ఆసక్తికర కామెంట్స్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)పై గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారానికి ‘పుష్ప’ నటుడు రాజశేఖర్ అనింగి(Rajasekhar Aningi) గట్టి కౌంటర్ ఇచ్చారు.

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)పై గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారానికి ‘పుష్ప’ నటుడు రాజశేఖర్ అనింగి(Rajasekhar Aningi) గట్టి కౌంటర్ ఇచ్చారు. బ్రాండ్ మేనేజర్ కావేరీ బారువా ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 రకాల నిబంధనలు (rules) పాటించాలని, ఆయన కళ్ళలోకి చూడకూడదని, షేక్ హ్యాండ్ ఇవ్వకూడదని చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో, పుష్ప 1, 2 సినిమాల్లో బన్నీతో కలిసి నటించిన రాజశేఖర్, ఆయన అసలు వ్యక్తిత్వం ఏంటో వివరిస్తూ ఒక వీడియో విడుదల చేశారు. రాజశేఖర్ అనింగి మాట్లాడుతూ.. ‘‘నేను పుష్ప సినిమా కోసం అల్లు అర్జున్ గారితో కలిసి నాలుగేళ్ల పాటు పనిచేశాను. ఆయన నేషనల్ అవార్డ్ విన్నర్ అని కూడా చూడకుండా ఇలాంటి ఆధారాల్లేని ఆరోపణలు చేయడం సరికాదు. షూటింగ్ విరామ సమయంలో ప్రొడక్షన్ బాయ్స్ స్నాక్స్ పట్టుకొచ్చినప్పుడు, మాలాంటి ఆర్టిస్టులకు అసిస్టెంట్లు ఉంటారు. కానీ అల్లు అర్జున్ గారు మాత్రం ఏమాత్రం ఆలోచించకుండా నేరుగా వెళ్లి ఆ బేసిన్ లో నుంచే స్పాట్ బాయ్స్‌తో కలిసి స్నాక్స్ తింటారు.
అంతటి నిరాడంబరమైన వ్యక్తి కళ్ళలోకి చూడొద్దు, షేక్ హ్యాండ్ ఇవ్వొద్దు అని రూల్స్ పెడతారంటే ఎవరూ నమ్మరు’’ అని మండిపడ్డారు. అల్లు అర్జున్ సెట్‌లోకి రాగానే ప్రతి చిన్న టెక్నీషియన్‌ను, ఆర్టిస్టును పేరుపేరునా పలకరిస్తారని రాజశేఖర్ గుర్తుచేశారు. ఒకవేళ పొరపాటున ఎవరినైనా విష్ చేయడం మర్చిపోతే, వెంటనే 'సారీ.. మిమ్మల్ని చూడలేదు' అని చెప్పే గొప్ప మనసు ఆయనదని కొనియాడారు. కేవలం చీప్ పబ్లిసిటీ కోసమే ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ఐకాన్ స్టార్ ఎప్పుడూ ఒక జెంటిల్‌మెన్‌లా ఉంటారని ఆయన స్పష్టం చేశారు. "ఆయన హీరో మాత్రమే కాదు.. అంతకంటే గొప్ప మనిషి" అంటూ రాజశేఖర్ బన్నీకి మద్దతుగా నిలిచారు. ఇక ఈ వివాదం ముదురుతుండటంతో అల్లు అర్జున్ టీమ్ కూడా అధికారిక ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, బన్నీ ఎప్పుడూ హుందాగా ప్రవర్తిస్తారని పేర్కొన్నారు. తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్న వారిపై తమ లీగల్ టీమ్ పరువు నష్టం దావా వేయబోతున్నట్లు హెచ్చరించారు.






