Naga Chaitanya: తల్లి కాబోతున్న శోభిత ధూళిపాళ.. ఉత్తేజకర పరిణామాలంటూ హింట్ ఇచ్చేసిన నాగచైతన్య

by Mallepaka Hamsa |   (  Updated:2026-02-12 11:19:37  IST  )

ఓ ఇంటర్వ్యూలో నాగచైతన్య ఈ ఏడాది తనకు కలిసి వచ్చిందని, ఉత్తేజకర పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పాడు. దీంతో నాగచైతన్య, శోభిత తల్లిదండ్రులు కాబోతున్నారా? ఉత్తేజకర పరిణామాలు అవేనా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Naga Chaitanya: తల్లి కాబోతున్న శోభిత ధూళిపాళ.. ఉత్తేజకర పరిణామాలంటూ హింట్ ఇచ్చేసిన నాగచైతన్య
X

దిశ, సినిమా: అక్కినేని నాగచైతన్య(Akkineni Naga Chaitanya) గత ఏడాది తనకు అదృష్టం కలిసొచ్చినట్లు వెల్లడించాడు. 2025 సంవత్సరం తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని.. తన కెరీర్‌లోనే కీలక మలుపు చోటుచేసుకున్నట్లు తెలిపాడు. ‘‘2025 నాకు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే.. ‘తండేల్’ రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరడమే కాకుండా అది ఓటీటీ డీల్‌లోనూ రికార్డులు సృష్టించింది. నా కెరీర్‌లో థియేటర్‌లో తండేల్, దూత వల్ల ఎంతో మార్పు వచ్చింది. నా కెరీర్‌లో 25వ ప్రాజెక్ట్‌గా రాబోతున్న ‘వృషకర్మ’ (Vrushakarma)తో బిజీగా ఉన్నాను.

ఇప్పటివరకూ చేయని కంటెంట్‌తో ప్రేక్షకులను పలకరించనున్నా. ఈ కొత్త సంవత్సరంలో నా లైఫ్‌లో ఎన్నో ఉత్తేజకరమైన పరిణామాలు జరగనున్నాయి. నా కుటుంబంతో కలిసి ఆ క్షణాలను ఆస్వాదించడానికి, నటుడిగా కొత్త కథలను ఎంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. కథల ఎంపిక విషయంలోనూ చాలా జాగ్రత్తలు వహిస్తు్న్నాను’’ అని అన్నాడు. ప్రస్తుతం నాగచైతన్య కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

నాగచైతన్య, శోభిత తల్లిదండ్రులు కాబోతున్నారా? ఉత్తేజకర పరిణామాలు అవేనా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నాగచైతన్య సినిమాల విషయానికొస్తే.. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వృషకర్మ’. ఈ మైథలాజికల్ థ్రిల్లర్‌ను కార్తీక్ వర్మ దండు(Karthik Varma Dandu) తెరకెక్కిస్తున్నారు. సుకుమార్ నిర్మాణంలో రూపొందుతోంది. ఇందులో చైతు సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘తండేల్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రాబోతున్న ప్రాజెక్ట్ కావడంతో అభిమానులు ఈ మూవీపై ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు.

Read More..

Samantha: పెళ్లైన నెలకే గుడ్ న్యూస్ ప్రకటించిన సమంత..షాక్‌లో నెటిజన్లు (పోస్ట్)

Next Story