‘మజాకా’ రివ్యూ.. సందీప్ కిషన్ హిట్ కొట్టాడా.. లేదా..

by Gugulothu.Kavitha |   (  Updated:2025-02-26 15:26:06  IST  )

యంగ్ హీరో సందీప్ కిషన్(Sundeep Kishan), యంగ్ బ్యూటీ రీతూ వర్మ(Ritu Varma) జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మజాకా’(Mazaka).

‘మజాకా’ రివ్యూ.. సందీప్ కిషన్ హిట్ కొట్టాడా.. లేదా..
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ హీరో సందీప్ కిషన్(Sundeep Kishan), యంగ్ బ్యూటీ రీతూ వర్మ(Ritu Varma) జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మజాకా’(Mazaka). స్టార్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన(Trinatharao Nakkina) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సీనియర్ యాక్టర్ రావు రమేష్(Rao Ramesh), అన్షు(Anshu) కీ రోల్ ప్లే చేశారు. అయితే ఈ మాస్ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని ఎ కె ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ బ్యానర్స్ పై రాజేష్ దండ(Rajesh Danda), ఉమేష్ కె ఆర్ బన్సాల్ నిర్మించారు.

అయితే మజాకా నుంచి ఇప్పటికే విడుదలైన ప్రతి అప్డేట్ ఆకట్టుకుని సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. కాగా ఈ సినిమా నేడు శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్‌ అయింది. మరి ఈ సినిమాతో సందీప్ కిషన్ హిట్ కొట్టాడా లేదా అనేది మనం ఇప్పుడు చూద్దాం..

కథ విషయానికొస్తే.. కృష్ణ(సందీప్ కిషన్), రమణ(రావు రమేష్) తండ్రి కొడుకులు. కృష్ణ పుట్టినప్పుడే తల్లి చనిపోవడంతో ఇంట్లో వీరిద్దరే ఉంటారు. వీళ్ళ ఇంట్లోకి ఒక అమ్మాయి రావాలని, ఇంట్లో ఫ్యామిలీ ఫొటో ఉండాలని అనుకుంటారు. కృష్ణకు సంబంధాలు ట్రై చేస్తుంటే ఇంట్లో ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు, ఆడతోడు లేని ఇంటికి పిల్లను ఇవ్వం అని అంటూ ఉంటారు. రమణకి పెళ్లి అయితే కృష్ణకు సంబంధాలు వస్తాయి అని చెప్తారు.

అదే సమయంలో రమణ యశోద(అన్షు అంబానీ)ని చూసి ప్రేమిస్తాడు. కృష్ణ కూడా మీరా(రీతూ చౌదరి) ప్రేమలో పడతాడు. మరి వీరిద్దరి ప్రేమలు ఫలించాయా? వీరికి పెళ్లిళ్లు అయ్యాయా? వీరి పెళ్లి అవ్వడానికి ఎదురైన అడ్డంకులు ఏంటి? యశోద ఇంకా పెళ్లి చేసుకోకుండా ఎందుకుంది? యశోద – మీరాకు సంబంధం ఏంటి అనేదే మజాకా మూవీ.

ఇక రివ్యూ విషయానికి వస్తే.. ఈ సినిమా ప్రీమియర్ చూసిన నెటిజన్లు తమ అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా పంచుకుంటున్నారు. మజాకా సినిమా అదిరిపోయిందని… ముఖ్యంగా కామెడీ వేరే లెవల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ఈ సినిమాలో తండ్రీకొడుకులుగా సందీప్ కిషన్, రావు రమేష్ కాంబినేషన్ సూపర్ అని.. ఇద్దరూ అద్భుతంగా నటించారని.. ఈ సినిమాలో రావు రమేష్ కామెడీ టైమింగ్, పంచులు అదిరిపోయాయని అంటున్నారు. వీరిద్దరి మధ్య వచ్చే ప్రతి సీన్ థియేటర్లో ఎంజాయ్ చేస్తామని.. 100% ఎంటర్టైన్మెంట్ అని.. పక్కా ఫ్యామిలీ మూవీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చాలా కాలం తర్వాత పర్ఫెక్ట్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూశామని.. అన్షు యాక్టింగ్ గుడ్ అంటున్నారు.


click for tweet ..

Next Story