- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరోనా కట్టడికి ‘కోల్డ్ జైమ్’ మౌత్ స్ప్రే
<p>దిశ, వెబ్‌డెస్క్ : కరోనా రోజురోజుకీ విజృంభిస్తుండటంతో వ్యాక్సిన్‌ను సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇండియాలోని ప్రముఖ ఫార్మా దిగ్గజాలతో పాటు ప్రపంచంలోని చాలా కంపెనీలు వ్యాక్సిన్ పరిశోధనలో తలమునకలై ఉన్నాయి. భారత్ బయోటిక్ కూడా ఇప్పటికే తమ ‘కోవాగ్జిన్’ క్లినికల్ ట్రయల్స్ ముగించుకుని మనుషులపై ప్రయోగాలు చేస్తోంది. అటు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ కూడా తాము రూపొందిస్తున్న వ్యాక్సిన్ ప్రయోగాల్లో సానుకూల ఫలితాలు వస్తున్నాయని తెలిపింది. రష్యా తయారు చేస్తున్న కోవిడ్ టీకా కూడా […]</p>

దిశ, వెబ్‌డెస్క్ :
కరోనా రోజురోజుకీ విజృంభిస్తుండటంతో వ్యాక్సిన్‌ను సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇండియాలోని ప్రముఖ ఫార్మా దిగ్గజాలతో పాటు ప్రపంచంలోని చాలా కంపెనీలు వ్యాక్సిన్ పరిశోధనలో తలమునకలై ఉన్నాయి. భారత్ బయోటిక్ కూడా ఇప్పటికే తమ ‘కోవాగ్జిన్’ క్లినికల్ ట్రయల్స్ ముగించుకుని మనుషులపై ప్రయోగాలు చేస్తోంది. అటు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ కూడా తాము రూపొందిస్తున్న వ్యాక్సిన్ ప్రయోగాల్లో సానుకూల ఫలితాలు వస్తున్నాయని తెలిపింది. రష్యా తయారు చేస్తున్న కోవిడ్ టీకా కూడా క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకుని వచ్చే నెలలోనే మార్కెట్లోకి విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో.. స్వీడన్‌కు చెందిన లైఫ్ సైన్స్ సంస్థ ‘ఎంజైమాటికా’(Enzymatica) మరో శుభవార్త చెప్పింది. తాము తయారు చేసిన మౌత్ స్ప్రేతో కరోనాను కట్టడి చేయొచ్చని పేర్కొంది. దాని పేరే ‘కోల్డ్ జైమ్’. ఈ మౌత్ స్ప్రే కేవలం 20 నిమిషాల్లో కరోనాకు కారణమైన ‘సార్స్-కోవ్2’ వైరస్‌ను నాశనం చేస్తుందని, దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవని ప్రకటించింది. ఈ స్ప్రే నోటిలోని 98.3 శాతం వైరస్‌ను చంపేస్తుందని సంస్థ వెల్లడించింది. అమెరికాకు చెందిన మైక్రోబాక్ లేబొరేటరీస్ ద్వారా ఇంటర్నేషనల్ టెస్ట్ మెథడ్‌లో ఈ అధ్యయనం నిర్వహించామని వెల్లడించింది.
నిజానికీ స్ప్రేను సాధారణ జలుబు నివారణ కోసం అభివృద్ధి చేసినా.. కరోనాతోపాటు వివిధ రకాల వైరస్‌లను ఇది అడ్డుకుంటుందని పరిశోధకులు తెలిపారు. కోల్డ్‌జైమ్‌ను నోరు, గొంతు లోపలికి స్ప్రే చేస్తే ఇన్‌ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దీంతో స్థానికంగా వైరల్ లోడ్ తగ్గుతుంది. ఫలితంగా వైరస్ వ్యాప్తిని కూడా బాగా తగ్గిస్తుందని కంపెనీ పేర్కొంది. దీని తయారీలో గ్లిజరాల్, అట్లాంటిక్ కాడ్ ట్రిప్నిన్లు ఉపయోగించినట్టు వివరించారు.
ఆయా సంస్థలు తాము అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లు, ఇంజక్షన్లు, మందులు, ట్యాబ్లెట్లు, మౌత్ స్ప్రేలను కరోనా నిరోధిస్తాయని ఘంటాపథంగా చెబుతున్నాయి. కానీ అవి ఎంతవరకు మనుషుల మీద ప్రభావం చూపుతాయో ఇప్పుడే చెప్పలేం. కరోనా వ్యాక్సిన్ 100 శాతం సక్సెస్ సాధించేంత వరకు మన జాగ్రత్తల్లో మనం ఉండటం మంచిది.






