మోటోరోలా నుంచి చీపెస్ట్ 5జీ ఫోన్

by  |
మోటోరోలా నుంచి చీపెస్ట్ 5జీ ఫోన్
X

దిశ, వెబ్‌డెస్క్: మోటోరోలా కంపెనీ జీ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను బుధవారం యూరప్ మార్కెట్లో లాంచ్‌ చేసింది. చాలా రోజుల నుంచి ఎంట్రీ లెవల్ 5జీ స్మార్ట్‌ఫోన్‌పై పనిచేస్తున్న మోటోరోలా.. ఎట్టకేలకు ఆ ఫోన్‌ను విడుదల చేసింది. ఇప్పటికే ఎమ్ఐ10 ప్రో, ఐక్యూఓఓ 3 ఫోన్లు 5జీ సపోర్ట్‌తో ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టాయి. హువాయ్ కంపెనీ కూడా తక్కువ ధరలో 5జీ ఫోన్లను తీసుకొచ్చే పనుల్లో ఉంది. ఇక మోటో జీ- 5జీ ప్లస్‌ ఫోన్ విషయానికొస్తే.. ఈ ఫోన్‌ రెండు కలర్లలో అందుబాటులో ఉంది. యూరప్‌తో పాటు యూఏఈ, సౌదీ అరేబియాలో గురువారం నుంచి ఈ ఫోన్ అందుబాటులో ఉండనుండగా.. త్వరలోనే భారత్‌లో విడుదల చేయనున్నట్లు సమాచారం.

మోటో జీ 5G ప్లస్‌ ఫీచర్స్:

డిస్‌ప్లే : 6.70 ఇంచులు
ప్రాసెసర్‌ : క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్‌ 765
ర్యామ్‌ : 4జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్‌ : 64జీబీ
ఓఎస్‌ : ఆండ్రాయిడ్‌ 10
సెల్ఫీ కెమెరా. : 16+8 మెగాపిక్సల్‌
రేర్‌ కెమెరా : 48+8+5+2 మెగా పిక్సల్‌
బ్యాటరీ : 5000mAh
ధర (యూరప్‌లో ) : €349 (రూ. 29,510/-)

యూరప్‌లో 6GB ర్యామ్‌ + 128GB స్టోరేజ్‌ ధర రూ. 33,700/-గా కంపెనీ నిర్ణయించింది.

Next Story

Most Viewed