- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తల్లిపై కుమారుడు అఘాయిత్యం.. తల్లి ఏంచేసిందంటే..?
<p>దిశ, వెబ్‌డెస్క్: ప్రతి తల్లి తన కన్నబిడ్డను కంటికి రెప్పలా చూసుకొంటుంది. కానీ ఆ కన్నకొడుకు తనను వేధిస్తుంటే.. మద్యంమత్తులో తల్లినే హింసలకు గురిచేస్తుంటే.. ఆ వేధింపులు తట్టుకోలేని ఆ తల్లి కన్నకొడుకును చంపేసింది. ఎవరికి తెలియకుండా ఇంట్లోనే పూడ్చిపెట్టింది. ఈ దారుణ ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే.. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రామకృష్ణాపురంలో నాగమ్మ అనే మహిళకు ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు శివ(26). కుమార్తెలకు పెళ్లిళ్లు కావడంతో […]</p>

దిశ, వెబ్‌డెస్క్: ప్రతి తల్లి తన కన్నబిడ్డను కంటికి రెప్పలా చూసుకొంటుంది. కానీ ఆ కన్నకొడుకు తనను వేధిస్తుంటే.. మద్యంమత్తులో తల్లినే హింసలకు గురిచేస్తుంటే.. ఆ వేధింపులు తట్టుకోలేని ఆ తల్లి కన్నకొడుకును చంపేసింది. ఎవరికి తెలియకుండా ఇంట్లోనే పూడ్చిపెట్టింది. ఈ దారుణ ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే.. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రామకృష్ణాపురంలో నాగమ్మ అనే మహిళకు ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు శివ(26). కుమార్తెలకు పెళ్లిళ్లు కావడంతో కొడుకు శివతో కలిసి నివసిస్తుంది. అయితే శివ మద్యానికి బానిసవడంతో నిత్యం మద్యంతాగి వచ్చి తల్లిని వేధించేవాడు.
ఈ నేపథ్యంలోనే వారం క్రితం ఫుల్లుగా మద్యం తాగి వచ్చి తల్లి నాగమ్మతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. దీంతో కొడుకు ప్రవర్తనతో విసిగిపోయిన నాగమ్మ తన తల్లి బుచ్చమ్మ సాయంతో మద్యం మత్తులో ఉన్న కుమారుడి గొంతు నులిమి హతమార్చింది. అనంతరం కొడుకు మృతదేహాన్ని ఇంటి ఆవరణలో గొయ్యి తీసి పూడ్చిపెట్టింది. ఇక ఈ విషయం ఆదివారం సర్పంచ్ ద్వారా బయటపడింది. ఈ ఘటనపై సర్పంచ్‌తోపాటు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నాగశేఖర్ రెడ్డి తెలిపారు.






