Raj Thackeray: అదృష్టం సమానమైన విజయాలను ఇవ్వదు MNS చీఫ్ రాజ్‌ఠాక్రే ట్వీట్

by Gopi |
Raj Thackeray Posts Sarcastic Tweets, Day after Uddhav Thackeray Resigns
X

ముంబై: Raj Thackeray Posts Sarcastic Tweets, Day after Uddhav Thackeray Resigns| మహారాష్ట్ర సీఎం పదవికి రాజీనామా చేసిన ఉద్ధవ్ ఠాక్రేను ఉద్దేశించి ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. అదృష్టం అందరికీ సమానమైన విజయాలను ఇవ్వదని అన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ట్వీట్ చేశారు. 'ఎవరైనా ఒకరి అదృష్టాన్ని ఒకరి వ్యక్తిగత సాఫల్యంగా తప్పుగా అర్థం చేసుకుంటే, ఆ ఒక్కరి పతనం వైపు ప్రయాణం అక్కడ ప్రారంభమవుతుంది' అని పేర్కొన్నారు. మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు వరుసకు సోదరుడైన రాజ్ ఠాక్రే 2005లోనే శివసేనతో తెగతెంపులు చేసుకున్నారు. అనంతరం కొత్త పార్టీని ఏర్పాటు చేశారు.

Next Story