ఇట్లు మారేడుమిల్లి ప్రజానికం.. ఆసక్తికరంగా బ్యాక్‌డ్రాప్ స్టోరీ

by Disha Web |
ఇట్లు మారేడుమిల్లి ప్రజానికం.. ఆసక్తికరంగా బ్యాక్‌డ్రాప్ స్టోరీ
X

దిశ, సినిమా : టాలీవుడ్‌లో కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌‌గా నిలిచిన అల్లరి నరేష్ కొద్ది కాలం వరుస ఫ్లాప్స్‌తో ఇబ్బందిపడ్డ సంగతి తెలిసిందే. అయితే 'నాంది' మూవీ సక్సెస్‌తో మళ్లీ ట్రాక్ ఎక్కిన్నట్లే కనిపిస్తున్నాడు అల్లరోడు. ఈ చిత్రంలో తన నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా కాగా.. ఇకపై కంటెంట్‌ ఉన్న సినిమాల్లోనే నటించాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ క్రమంలోనే నరేష్ హీరోగా నటించిన తాజా చిత్రం 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. అటవీవాసుల బ్యాక్‌డ్రాప్ స్టోరీతో తెరకెక్కిన ఈ మూవీ నుంచి ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆసక్తి రేకెత్తించింది. ఇక నేడు నరేష్ పుట్టినరోజు సందర్భంగా అద్భుతమైన టీజర్‌ విడుదల చేశారు మేకర్స్. ఏఆర్ మోహన్ దర్శకత్వం వహించిన చిత్రంలో ఆనంది కథానాయికగా కనిపించగా.. వెన్నెల కిషోర్, చమ్మక్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల స్వరాలు సమకూరుస్తున్నారు.Next Story