ఎక్కువ మంది అమ్మాయిలు సీక్రెట్‌గా వాడుతున్న పాస్‌వర్డ్‌ ఇదే !

by  |
ఎక్కువ మంది అమ్మాయిలు సీక్రెట్‌గా వాడుతున్న పాస్‌వర్డ్‌ ఇదే !
X

దిశ, వెబ్‌డెస్క్ : ఈ డిజిటల్ కాలంలో ప్రతి ఒక్కరం ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, జీమెయిల్, ఆన్లైన్ బ్యాకింగ్.. వంటి అప్లికేష‌న్లు వాడుతున్నాం. వాటికి యూజ‌ర్ నేమ్, పాస్‌వ‌ర్డ్‌ను సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. కొంద‌రైతే, అన్ని అప్లికేష‌న్లకు ఒకే పాస్‌వ‌ర్డ్‌‌ను లేదా చాలా ఈజీగా ఉండే పాస్‌వ‌ర్డ్స్ వాడుతుంటారు. పాస్‌వ‌ర్డ్ ఈజీగా ఉండటంతో హ్యాక‌ర్స్‌, సైబ‌ర్ క్రిమిన‌ల్స్ పాస్‌వ‌ర్డ్స్‌ను ఈజీగా క్రాక్ చేసి.. ప‌ర్సన‌ల్ డేటాను హ్యాక్ చేస్తారు. ఈ విషయంలో భారతీయులు చాలా వెనకబడే ఉన్నారని NordPass పరిశోధన నివేదిక చెబుతోంది. ఈ నివేదిక ప్రకారం భారతీయలు పాస్‌వర్డ్‌లను కనిపెట్టేందుకు పెద్దగా కష్టపడనవసరం లేదట.

ఇండియన్స్‌ ఎక్కువగా 123456, 123456789, 111111,12345 లేదా qwerty, పాస్‌వర్డ్‌, asdfghjkl, asdfgh 147258369 abc123, iloveyou వంటి పాస్‌వర్డ్‌లను పెడుతున్నారనీ, వీటిని కేవలం సెకండ్ల వ్యవధిలోనే క్రాక్‌ చేయవచ్చునని నివేదిక చెబుతోంది. india123 అనే పాస్‌వర్డ్‌ మాత్రం 17 నిమిషాల్లో క్రాక్ అవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది, సొంత పేర్లనే పాస్‌వర్డ్‌లుగా వాడుతున్నారని నివేదిక తెలిపింది. ‘Onedirection’ అనే పాస్‌వర్డ్‌ మోస్ట్‌ పాపులర్‌ అయ్యింది కానీ, 2020 నివేదికలోపాపులరీటి రికార్డ్ కోల్పోయినా, ప్రస్తుతం వివిధ దేశాల్లో సాధారణంగా ఉపయోగించే పాస్‌వర్డ్‌ల జాబితాలోకి చేరింది.

NordPass నివేదిక ప్రకారం ఇంగ్లాండ్‌‌లో ప్రజాలు ఫుట్‌బాల్‌ క్లబ్‌ లివర్‌పూల్‌కు సంబంధించిన పాస్‌వర్డ్స్ ఎక్కువగా వినియోగిస్తూన్నారని తెలియజేసింది. NordPass ఏ పాస్‌వర్డ్‌ ఎన్నిసార్లు ఉపయోగించబడిందో, ఏ పాస్‌వర్డ్‌ను ఎక్కువ ఉపయోగిస్తున్నారో అంచనా వేస్తోంది. కార్ల విషయానికి వస్తే, ఎక్కువగా ఫెరారీ, ఫోర్బ్స్‌ పేర్లు పాస్‌వర్డ్‌లుగా వాడుతున్నారని ఈ నివేదిక వెల్లడించింది. ఈ కార్ల పాస్‌వర్డ్‌లు కూడా ఈజీగా క్రాక్‌ చేయవచ్చని NordPass తన నివేదికలో పేర్కొంది. యూఎస్‌ విషయనికి వస్తే పురుషుల కంటే, మహిళలు ఎక్కువగా iloveyou అనే పదాన్ని పాస్‌వర్డ్‌గా వాడుతున్నారట.

ప్రస్తుతం సైబర్‌ నేరాలు ఎక్కువ అవుతోన్న నేపథ్యంలో, పాస్‌వర్డ్‌ అనేది చాలా కీలకమైనది. పాస్‌వర్డ్‌ను ఎంతో కీలకమైనది కాబట్టి, స్ట్రాంగ్‌గా పెట్టుకోవటం చాలా ముఖ్యమైన అంశం. బలమైన పాస్‌వర్డ్‌ల వలన సైబర్‌ దాడుల నుంచి తప్పించుకోవచ్చునని నివేదిక సూచిస్తోంది. పెద్ద, చిన్న అక్షరాలు, నెంబర్లు, స్పెషలు‌ క్యారెక్టర్‌ల కాంబినేషన్‌తో పాస్‌వర్డ్‌లు పెట్టుకుంటే, సురక్షితంగా ఉండవచ్చునని తెలిపింది.



Next Story

Most Viewed