- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంట్లోకెళ్లిన కోతులు : బంగారం, నగదు చోరీ
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్: ఇంట్లో చొరబడిన ఓ కోతుల గ్యాంగ్ దర్జాగా బంగారం, నగలు ఎత్తుకెళ్లిపోయాయి. ఈ ఘటన తమిళనాడులోని తిరువైయారులో చోటు చేసుకుంది. భర్త చనిపోవడంతో సారతంబల్ అనే 70 ఏళ్ళ వృద్ధురాలు ఇంట్లో ఒంటరిగా నివసిస్తోంది. ఆమె ఇంటి బయట బట్టలు ఉతుక్కుంటుండగా ఇంట్లోకి ప్రవేశించాయి కోతుల గుంపు. ఇంట్లోని అరటిపండ్లు, బియ్యం సంచిని ఎత్తుకెళ్లాయి. కాగా ఆ బియ్యం సంచిలోనే తన బంగారు ఆభరణాలు, రూ.25 వేలను దాచుకుంది పాపం ఆ వృద్ధురాలు. ఆమె కోతులను వెంబడించినా […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఇంట్లో చొరబడిన ఓ కోతుల గ్యాంగ్ దర్జాగా బంగారం, నగలు ఎత్తుకెళ్లిపోయాయి. ఈ ఘటన తమిళనాడులోని తిరువైయారులో చోటు చేసుకుంది. భర్త చనిపోవడంతో సారతంబల్ అనే 70 ఏళ్ళ వృద్ధురాలు ఇంట్లో ఒంటరిగా నివసిస్తోంది. ఆమె ఇంటి బయట బట్టలు ఉతుక్కుంటుండగా ఇంట్లోకి ప్రవేశించాయి కోతుల గుంపు. ఇంట్లోని అరటిపండ్లు, బియ్యం సంచిని ఎత్తుకెళ్లాయి.
కాగా ఆ బియ్యం సంచిలోనే తన బంగారు ఆభరణాలు, రూ.25 వేలను దాచుకుంది పాపం ఆ వృద్ధురాలు. ఆమె కోతులను వెంబడించినా ఫలితం లేకుండా పోయింది. ఆ డబ్బు తన వైద్య ఖర్చుల కోసం దాచుకున్నట్లు చెప్పి బోరుమంది. స్థానికులు ఆ కోతుల కోసం గాలించినా వాటి జాడ తెలియరాలేదు. ఆగ్రహించిన స్థానికులు ఆ కోతులను బంధించాలని, వాటి ఆగడాలు ఎక్కువయ్యాయని, వాటిని గ్రామంలో కనిపించకుండా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
Next Story






