సన్నాఫ్ ఇండియా: నేను క‌స‌క్ అంటే మీరంద‌రూ 'ఫ‌సక్'

by  |
సన్నాఫ్ ఇండియా: నేను క‌స‌క్ అంటే మీరంద‌రూ ఫ‌సక్
X

దిశ, వెబ్‌డెస్క్: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చాలా గ్యాప్ తర్వాత హీరోగా కనపడుతున్న చిత్రం ‘సన్నాఫ్ ఇండియా’. డైమండ్ రత్నం బాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మోహన్ బాబు స్క్రీన్ ప్లే అందించడం విశేషం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, మోహన్ బాబు లుక్ ఈ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ని హీరో సూర్య ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు. మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ తో మొదలైన టీజర్ ఆద్యంతం ఆకట్టుకొంది. పవర్ ఫుల్ రోల్ లో మోహన్ బాబు కనిపించి మెప్పించాడు.

https://twitter.com/Suriya_offl/status/1400706430647238661?s=20

‘మన అంచ‌నాల‌కు అంద‌ని వ్య‌క్తిని ఇప్పుడు మీకు ప‌రిచ‌యం చేయ‌బోతున్నాను.. త‌న రూటే సె‌ప‌రేటు’ అంటూ మెగాస్టార్‌ చిరంజీవి వాయిస్ ఓవ‌ర్ హైలైట్ గా నిలిచింది. ఇక చివర్లో మోహన్ బాబు ఫేమస్ డైలాగ్ ఫసక్ అనే మాటను ఉపయోగిస్తూ ‘నేను కసక్ అంటే మీరందరు ఫసక్’ అని చెప్పాయి డైలాగ్ ఆకట్టుకొంది. ఇక టీజర్ లో మోహన్ బాబు పలు రకాల గెటప్ లో కనిపించాడు. ఇక ఈ సినిమాకు ఇళయరాజా మ్యూజిక్ ఒక ఎస్సెట్ గా నిలవనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ పవర్ ఫుల్ పాత్రతో కలెక్షన్ కింగ్ ఎన్ని కలెక్షన్లు రాబడతాడో చూడాలి.


Next Story

Most Viewed