- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యార్లగడ్డను పరామర్శించిన నటుడు మోహన్ బాబు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ను ప్రముఖ సినీ నటుడు మోహన్‌బాబు పరామర్శించారు. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఇటీవల తన తల్లిని కోల్పోయారు. దీంతో శనివారం మోహన్ బాబు హైదరాబాద్ నుంచి నేరుగా విజయవాడ చేరుకున్నారు. విజయవాడ నుంచి పెదపారుపూడి మండలం వానపాముల గ్రామంలోని యార్లగడ్డ నివాసానికి వెళ్లారు. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తల్లి రంగనాయకమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మోహన్ […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ను ప్రముఖ సినీ నటుడు మోహన్‌బాబు పరామర్శించారు. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఇటీవల తన తల్లిని కోల్పోయారు. దీంతో శనివారం మోహన్ బాబు హైదరాబాద్ నుంచి నేరుగా విజయవాడ చేరుకున్నారు. విజయవాడ నుంచి పెదపారుపూడి మండలం వానపాముల గ్రామంలోని యార్లగడ్డ నివాసానికి వెళ్లారు. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తల్లి రంగనాయకమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ.. యార్లగడ్డ తనకు అత్యంత ఆప్తుడని వెల్లడించారు. ఆయన తల్లిని కోల్పోవడం తనను కలచి వేసిందన్నారు. రంగనాయకమ్మ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని మోహన్‌బాబు తెలిపారు.
- Tags
- Mohan Babu
Next Story






