- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గజినీకి గురువుగా..‘రజనీ ఫ్రెండ్’
<p>కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సెలెక్టెడ్‌గా మూవీస్ చేస్తున్నారు. చివరగా జాతీయ అవార్డు పొందిన ‘మహానటి’ సినిమాలో కనిపించిన ఆయన..ప్రస్తుతం తమిళ హీరో సూర్య హీరోగా వస్తున్న ‘ఆకాశమే నీ హద్దురా’ చిత్రంలో ప్రధాన పాత్రలో కనిపిస్తున్నారు. డైరెక్టర్ సుధా కొంగర ఈ సినిమా గురించి చెప్పగానే వెంటనే ఓకే చెప్పారట మోహన్ బాబు. రియల్ లైఫ్‌లో సూపర్‌స్టార్ రజినీకాంత్ ఫ్రెండ్ అయిన ఈ పెదరాయుడు..సూర్య సినిమాలో సీనియర్ ఎయిర్ ఫోర్స్ అధికారి భక్తవత్సలం పాత్ర చేస్తుండగా..ఇందుకు […]</p>

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సెలెక్టెడ్‌గా మూవీస్ చేస్తున్నారు. చివరగా జాతీయ అవార్డు పొందిన ‘మహానటి’ సినిమాలో కనిపించిన ఆయన..ప్రస్తుతం తమిళ హీరో సూర్య హీరోగా వస్తున్న ‘ఆకాశమే నీ హద్దురా’ చిత్రంలో ప్రధాన పాత్రలో కనిపిస్తున్నారు. డైరెక్టర్ సుధా కొంగర ఈ సినిమా గురించి చెప్పగానే వెంటనే ఓకే చెప్పారట మోహన్ బాబు.
రియల్ లైఫ్‌లో సూపర్‌స్టార్ రజినీకాంత్ ఫ్రెండ్ అయిన ఈ పెదరాయుడు..సూర్య సినిమాలో సీనియర్ ఎయిర్ ఫోర్స్ అధికారి భక్తవత్సలం పాత్ర చేస్తుండగా..ఇందుకు సంబంధించిన మోహన్ బాబు లుక్స్‌ను ఇటీవలే రిలీజ్ చేసింది మూవీ యూనిట్. సీనియర్ ఆఫీసర్‌గా..సూర్యకు సపోర్ట్‌గా నిలిచే గురువు క్యారెక్టర్‌లో కలెక్షన్ కింగ్ లుక్స్ అదిరిపోయాయి. ఎయిర్ లైన్, ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు కెప్టెన్ జీఆర్ గోపినాథ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూర్య కెప్టెన్ గోపీనాథ్ పాత్రలో కనిపించనుండగా..మోహన్ బాబు, సూర్యల మధ్య వచ్చే సీన్లు సినిమాకు హైలెట్‌గా నిలవనున్నాయట. కాగా సూర్య, గుణీత్ మోంగా నిర్మాతలుగా వ్యవహరించిన ఈ చిత్రానికి..జీవీ ప్రకాశ్ మ్యూజిక్ అందించారు. ఏప్రిల్ 9న సినిమా విడుదల కానుంది. కాగా మోహన్ బాబు రియల్ నేమ్ కూడా భక్తవత్సలం కావడం విశేషం.






