మొబిక్విక్ యాప్ యాజర్లకు షాక్.. అది‌ నిజమేనా?

by  |
మొబిక్విక్ యాప్ యాజర్లకు షాక్.. అది‌ నిజమేనా?
X

దిశ, ఫీచర్స్: పేమెంట్ యాప్ ‘మొబిక్విక్’‌కు చెందిన 35 లక్షల మంది వినియోగదారుల సమస్త సమాచారాన్ని డార్క్‌వెబ్‌లో అమ్మకానికి పెట్టారంటూ రాజశేఖర్ రాఝరియా అనే సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు ఫిబ్రవరిలో పేర్కొన్నాడు. వీటిల్లో కేవైసీ సమాచారం, ఫోన్‌నెంబర్లు, ఆధార్‌ నెంబర్లు, పాన్, చిరునామా, ఈమెయిల్ ఐడీలు, పాస్‌వర్డ్‌లు, ఐపీ అడ్రస్, జీపీఎస్ లొకేషన్ల వంటి వాటిని డార్క్‌వెబ్‌లో ఉంచగా, చరిత్రలో ఇదే అతిపెద్ద ‘కేవైసీ డేటా లీక్’ అని ఎలియట్ ఆండర్సన్ అనే మరో రీసెర్చర్ అన్నారు. ఈ డేటాలో పాస్‌వర్డ్‌లు మాత్రమే ఎన్‌క్రిప్టెడ్‌ రూపంలో ఉన్నాయి. ఈ మొత్తం డేటాను 1.5 బిట్‌కాయిన్‌కు విక్రయించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని ఫ్రాన్స్‌కు చెందిన కొందరు నిపుణులు కూడా ధ్రువీకరించారు.

మొబిక్విక్ నుంచి దాదాపు 11 కోట్ల మంది భారతీయుల సమాచారానికి సంబంధించిన 8.2 టీబీల డేటా లీక్ అయినట్లు సమాచారం. ఆరు టెరా బైట్ల కేవైసీ డేటా, 350 జీబీల కంప్రెస్డ్ డేటా డార్క్‌వెబ్‌లో ఉందని తెలుస్తుండగా, ఈ ఆరోపణలను మొబిక్విక్ ఖండించింది. కాగా తాజాగా యూజర్లే స్వయంగా తమ డేటా లీకైనట్లు ప్రకటించడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కొక్కరి సమాచారాన్ని 1.5 బిట్ కాయిన్లు లేదా 86 వేల డాలర్లకు మొబిక్విక్ అమ్ముకుంటోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

‘వార్తల్లో నిలవాలనుకునే కొందరు సెక్యూరిటీ రీసెర్చర్లు కావాలనే ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి అసంబద్ధ, అవాస్తవమైన వార్తలతో మా కంపెనీ విలువైన సమయాన్ని వృథా అవుతోంది. మేము ఆ అంశంపై తీవ్రంగా దర్యాప్తు చేయగా..చివరికి ఏమీ లేదని తేలింది. మా వినియోగదారుల డేటాతో పాటు, కంపెనీ డేటా పూర్తి సురక్షితంగా ఉంది’ అని మొబిక్విక్ ప్రతినిధి స్పష్టం చేశారు.


Next Story

Most Viewed