దొంగలమర్రిలో ఎమ్మెల్సీ కవిత డ్యాన్స్.. ఫిదా అవ్వాల్సిందే..!

536

దిశ, వెబ్‌డెస్క్: నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జగిత్యాలలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దొంగలమర్రి చౌరస్తాలో స్థానికులతో కలిసి బతుకమ్మ ఆడారు. మంగ్లీ పాడిన రేలారే రేలా పాటకు బతుకమ్మ నృత్యాలు చేసిన ఎమ్మెల్సీ కవిత అక్కడి మహిళలను కాసేపు అలరించారు. అంతకుముందు పర్యటనలో భాగంగా.. ప్రముఖ పుణ్య క్షేత్రమైన కొండగట్టు అంజన్నను ఆమె దర్శించుకున్నారు. ఎమ్మెల్సీ కవితకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ కూడా పాల్గొన్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..