ఒక్క ఎమ్మెల్సీ స్థానానికి రూ.200 కోట్ల ఖర్చు..

by Shyam |   (  Updated:2021-03-20 11:32:52  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్-మహబూబ్ నగర్-రంగారెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి అనంతరం బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రరావు స్పందించారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని విమర్శించారు. పట్టభద్రులు టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఓట్లు వేశారని, నైతికంగా విజయం తనదేనని చెప్పుకొచ్చారు. 78 శాతం మంది పట్టభద్రులు ఈ ఎన్నికల్లో గులాబీ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు వేశారన్నారు. ‘వాణీ దేవి గెలుపు- పీవీ నర్సింహరావు’ విజయమని దానిని మీ ఖాతాలో వేసుకోవడం సరికాదని కారు పార్టీకి [&hellip;]</p>

ఒక్క ఎమ్మెల్సీ స్థానానికి రూ.200 కోట్ల ఖర్చు..
X

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్-మహబూబ్ నగర్-రంగారెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి అనంతరం బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రరావు స్పందించారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని విమర్శించారు. పట్టభద్రులు టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఓట్లు వేశారని, నైతికంగా విజయం తనదేనని చెప్పుకొచ్చారు.

78 శాతం మంది పట్టభద్రులు ఈ ఎన్నికల్లో గులాబీ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు వేశారన్నారు. ‘వాణీ దేవి గెలుపు- పీవీ నర్సింహరావు’ విజయమని దానిని మీ ఖాతాలో వేసుకోవడం సరికాదని కారు పార్టీకి హితవు పలికారు. ఉద్యోగులను టీఆర్ఎస్ ప్రభుత్వం బెదిరించిందని, గ్రాడ్యుయేట్లను కూడా డబ్బుతో కొన్నారని రామచందర్ రావు ఆరోపించారు. సామాన్యుడు ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి వచ్చిందని, ఒక్క ఎమ్మెల్సీ స్థానానికి రూ.200కోట్లు ఖర్చు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story