సోయిలేని స్థితిలో పోలీసులు ఉన్నారు : ఎమ్మెల్యే సీతక్క

by  |
mla-seethakka 1
X

దిశ, ములుగు : ఆరేళ్ల బాలికపై అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన దుర్మార్గుడిని నడిరోడ్డు మీద ఉరితీయాలి అని ఏఐసీసీ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇటీవల హైదరాబాద్‌లో అత్యాచారం, హత్యకు గురైన బాలిక కుటుంబ సభ్యులను సోమవారం సీతక్క పరామర్శించి జరిగిన పరిణామాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. అభం శుభం తెలియని ఆరేళ్ల చిన్నారిపై జరిగిన ఈ హింసాత్మక ఘటన అత్యంత దారుణమని, ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకూడదంటే ఇలాంటి దుర్మార్గులను నడి రోడ్డు పై ఉరి తీయాలన్నారు.

లేని పక్షంలో ఆ దుర్మార్గుడిని ప్రజలకు అప్పజెప్పితే ప్రజలే తగిన శిక్ష విధిస్తారని అన్నారు. మరోసారి ఇలా ఎవరైనా చేయాలంటే వెన్నులో వణుకు పుట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. న్యాయం కోసం నిరసన వ్యక్తం చేస్తున్న బాధిత కుటుంబ సభ్యులపై పోలీసులు దాడి చేయడాన్ని సీతక్క ఖండించారు. బాధ్యులేవరో, బాధితులేవరో తెలుసుకోలేని సోయిలో పోలీసులు ఉన్నారని పోలీస్ ఉన్నతాధికారులకు ఫోన్ చేసి ఫైర్ అయ్యారు.

Next Story