వైద్యశాలను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే సీతక్క

by  |
Congress leader
X

దిశ, వాజేడు : ములుగు జిల్లా, కన్నాయిగూడెం మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్యశాలను ములుగు ఎమ్మెల్యే దనసరి సీతక్క ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీతక్క వైద్యశాలను పరిశీలించి, వైద్యశాలలో విధులు నిర్వహిస్తున్న స్టాఫ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున వైద్యశాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వివరాలపై ఆరా తీశారు. గ్రామాలలో సీజనల్ వ్యాధులు రాకుండా ప్రజలకు పరిసరాలని పరిశుభ్రతగా ఉంచే విధంగా అవగాహన కార్యక్రమాల్ని నిర్వహించాలని ఆమె కోరారు.

Next Story