రాజు మృతిపై సీతక్క కీలక వ్యాఖ్యలు..(వీడియో)

by  |
రాజు మృతిపై సీతక్క కీలక వ్యాఖ్యలు..(వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో : సైదాబాద్ చిన్నారి హత్యాచార ఘటన నిందితుడు రాజు శవమై తేలడంతో ఎమ్మెల్యే సీతక్క సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ క్రమంలో ఓ వీడియోని ట్వీట్ చేశారు.

ఈ వీడియోలో.. ‘ఇది ప్రజల విజయం, చిన్నారి కుటుంబానికి న్యాయం జరగాలని వారం రోజులుగా చేస్తున్న ప్రజా ఉద్యమాన్ని.. ప్రభుత్వం పక్కదారి పట్టించే విధంగా ఇప్పటికే పట్టుకున్నామని, పట్టిస్తే పది లక్షలు ఇస్తామని చెబుతూ నిందితుడిని పట్టుకోలేదు. వాడిని శిక్షించలేదు. ప్రజా పోరాటం ద్వారానే వాడి వెన్నులో వణుకు పుట్టి ఆత్మహత్య చేసుకొని శవమై తేలిండు. ఇలాంటి ఘటనలకు భవిష్యత్తులో ఎవరైనా పాల్పడితే.. ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా.. ప్రజా పోరాటానికి భయపడి చావాల్సిందేనని.. మరొకరు ఇలాంటి తప్పుచేయకుండా ఇదొక పోరాట విజయంగా మనం భావించాలి. అంతేకాకుండా ఎలాంటి తప్పు చేయని రాజు కుటుంబ సభ్యులను, తన కూతురిని ప్రభుత్వం రక్షించాలి.’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

Next Story