- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్వచ్ఛమైన పాలకుడు మా జగనన్న: రోజా
<p>దిశ ఏపీ బ్యూరో: స్వచ్ఛమైన పాలనకు అచ్చమైన నిర్వచనం మా జగనన్న పాలన అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ రోజా సెల్వమణి అన్నారు. వైఎస్సార్సీపీ ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో సీఎం జగన్‌పై రోజా ప్రశంసల వర్షం కురిపించారు. ఇచ్చిన హామీలతోపాటు ఇవ్వని హామీలు కూడా నెరవేరుస్తున్న ఏకైక నాయకుడు తమ పార్టీ అధినేత అని ఆమె కొనియాడారు. ఈ ఏడాది పాలన స్వచ్ఛమైన పాలనకు అచ్చమైన నిర్వచనమని ఆమె అభివర్ణించారు. మేనిఫెస్టోను […]</p>

X
దిశ ఏపీ బ్యూరో: స్వచ్ఛమైన పాలనకు అచ్చమైన నిర్వచనం మా జగనన్న పాలన అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ రోజా సెల్వమణి అన్నారు. వైఎస్సార్సీపీ ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో సీఎం జగన్‌పై రోజా ప్రశంసల వర్షం కురిపించారు. ఇచ్చిన హామీలతోపాటు ఇవ్వని హామీలు కూడా నెరవేరుస్తున్న ఏకైక నాయకుడు తమ పార్టీ అధినేత అని ఆమె కొనియాడారు. ఈ ఏడాది పాలన స్వచ్ఛమైన పాలనకు అచ్చమైన నిర్వచనమని ఆమె అభివర్ణించారు. మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావించి ఏడాది కాలంలోనే 90 శాతం హామీలను నెరవేర్చిన అనితర సాధ్యుడు జగన్ అంటూ ఆమె కొనియాడారు. అత్యధిక శాతం సంక్షేమ ఫలాలను మహిళలకే అందిస్తూ ఆడపడుచుల ఆత్మబంధువై జగన్ నిలిచారని రోజా చెప్పుకొచ్చారు.
Next Story






