సామాజిక సేవ మా ల‌క్ష్యం అంటున్న కడియం శ్రీహరి

by  |
సామాజిక సేవ మా ల‌క్ష్యం అంటున్న కడియం శ్రీహరి
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : కరోనా కష్టకాలంలోనూ ఎన్ని ఒడిదొడుకులెదురైనా సామాజిక సేవే పరమార్థంగా పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలకు చేదోడువాదోడుగా ఉండడమే తమ లక్ష్యమని మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. తన కూతురు డాక్టర్ కడియం కావ్య నేతృత్వంలో నడుస్తున్న కడియం ఫౌండేషన్ ద్వారా వరంగల్, హనుమకొండలలో నడుస్తున్న వృద్ధాశ్రమాలు, దివ్యాంగుల సేవాసంస్థలకు గురువారం నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ.. స్వచ్ఛంద సేవ సవాల్ గా మారిన కరోనా సంక్షోభంలో నగరంలోని నాలుగు సంస్థలలోని వృద్ధులు, దివ్యాంగులకు నిత్యావసరాల సమీకరణ కష్టతరమవుతున్నదని తమకు సమాచారం అందిందని తమ స్పందనగా ఈ సంస్థలకు ఒక్కొక్క దానికి నెలకు సరిపడా నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నామన్నారు. కరోనా తరుణం పెను సవాల్ అని , ఈ సందర్భంలో ఆరోగ్యబాగోగులతో పాటు దినసరి అవసరాలు తీరడం కూడా కష్టమేనని వృద్ధాశ్రమ నిర్వహణద్వారా వృద్ధులకు సేవ చేస్తున్న సహృదయ సంస్థ చేస్తున్నసేవకు తాము అండగా ఉంటున్నామన్నారు.

నగరంలోని అతిథి, మల్లికాంబ , స్పందన మానసిక వికలాంగుల రిహాబిలిటేషన్ సెంటర్లలో జరిగిన కార్యక్రమాల్లో సుమారు రెండున్నర లక్షల రూపాయల విలువైన నిత్యావసరాలు కడియం తన కూతుళ్లు డాక్టర్ కడియం కావ్య , కడియం రమ్యలతో కలిసి పంపిణీ చేసారు. కార్యక్రమాల్లో మాట్లాడిన కడియం ఫౌండేషన్ ఛైర్ పర్సన్ డాక్టర్ కడియం కావ్య తమ ఫౌండేషన్ కరోనా మొదటి దశలో కూడా పనులు కోల్పోయిన వేలాది మందికి నిత్యావసరాలు పంపిణీ చేసిందని, ఈ సారి సేవయే పరమార్థంగా పనిచేస్తున్న సంస్థలు నిర్వహణలో ఎదుర్కుంటున్న సమస్యలను పరిగణనలోకి తీసుకొని నిత్యావసరాలు పంపిణీ చేసామన్నారు.

Next Story

Most Viewed