- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్డుపై తీవ్ర గాయాలతో వ్యక్తి.. TRS ఎమ్మెల్యే వెంటనే కారు ఆపి..
<p>దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో ఆదివారం రాత్రి ఓ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి గాయపడ్డాడు. సదరు వ్యక్తిని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కాపాడి మానవత్వాన్ని చాటారు. ఎమ్మెల్యే ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు నియోజకవర్గంలో పర్యటించిన అనంతరం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. రాత్రి 10:30 గంటల సమయంలో ఎమ్మెల్యే వాహనం డిచ్‌పల్లి వద్దకు చేరుకోగా, అక్కడ రోడ్డుపై తీవ్ర గాయాలతో నిస్సహాయ స్థితిలో ఉన్న […]</p>

దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో ఆదివారం రాత్రి ఓ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి గాయపడ్డాడు. సదరు వ్యక్తిని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కాపాడి మానవత్వాన్ని చాటారు. ఎమ్మెల్యే ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు నియోజకవర్గంలో పర్యటించిన అనంతరం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు.
రాత్రి 10:30 గంటల సమయంలో ఎమ్మెల్యే వాహనం డిచ్‌పల్లి వద్దకు చేరుకోగా, అక్కడ రోడ్డుపై తీవ్ర గాయాలతో నిస్సహాయ స్థితిలో ఉన్న వ్యక్తిని చూసి ఎమ్మెల్యే తన వాహనాన్ని వెంటనే ఆపారు. వాహనం నుంచి దిగి సదరు వ్యక్తితో మాట్లాడే ప్రయత్నం చేశారు. అపస్మారక స్థితిలో ఉండటంతో బాధితుడు తన వ్యక్తి వివరాలు చెప్పలేకపోయాడు. దీంతో ఎమ్మెల్యే 108కు సమాచారం ఇచ్చి ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. మానవత్వం చాటిన ఎమ్మెల్యేపై పలువురు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.






