- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షాకింగ్ న్యూస్.. అటవీశాఖలో మహిళా ఉద్యోగిని మిస్సింగ్
by Batti.Sumithra |
<p>దిశ, కామారెడ్డి: కామారెడ్డి డివిజన్ ఫారెస్ట్ కార్యాలయంలో పని చేస్తున్న ఓ మహిళా ఉద్యోగిని మిస్సింగ్ కలకలం రేపింది. రోజు మాదిరిగానే ఉదయం నుంచి సాయంత్రం వరకు విధులు ముగించుకున్న సదరు ఉద్యోగిని సాయంత్రం నుంచి కనపడకుండా పోయింది. సాయంత్రం తల్లిదండ్రులకు ఫోన్ చేసిన సదరు ఉద్యోగిని ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. రాత్రి అయినా అటు కార్యాలయంలో లేక, ఇటు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. కార్యాలయంలో సంప్రదించగా సాయంత్రమే వెళ్లినట్టుగా […]</p>

X
దిశ, కామారెడ్డి: కామారెడ్డి డివిజన్ ఫారెస్ట్ కార్యాలయంలో పని చేస్తున్న ఓ మహిళా ఉద్యోగిని మిస్సింగ్ కలకలం రేపింది. రోజు మాదిరిగానే ఉదయం నుంచి సాయంత్రం వరకు విధులు ముగించుకున్న సదరు ఉద్యోగిని సాయంత్రం నుంచి కనపడకుండా పోయింది. సాయంత్రం తల్లిదండ్రులకు ఫోన్ చేసిన సదరు ఉద్యోగిని ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. రాత్రి అయినా అటు కార్యాలయంలో లేక, ఇటు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. కార్యాలయంలో సంప్రదించగా సాయంత్రమే వెళ్లినట్టుగా చెప్పినట్టు సమాచారం. అయితే సదరు ఉద్యోగిని మిస్సింగ్ ఇప్పుడు ఆ శాఖను కలవరపాటుకు గురి చేసింది. కనపడకుండా పోయిన ఆ ఉద్యోగిని కోసం గుట్టుచప్పుడు కాకుండా గాలింపు చేపట్టారు అధికారులు. చివరగా పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది.
Next Story






