- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
త్వరలోనే పీఆర్సీ: మంత్రి ప్రశాంత్‌రెడ్డి
by Ramesh Goud |
<p> ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే తీపి కబురు చెబుతారని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ కలెక్టర్ గ్రౌండ్స్‌లో గురువారం టీఎన్‌జీఓల క్రీడోత్సవాలను నిర్వహించారు. వీటిని ప్రారంభించిన అనంతరం మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ పీఆర్సీ, వయస్సు పెంపుపై సీఎం కేసీఆర్ త్వరలోనే తీయని కబురు చెప్పనున్నారన్నారు. ఉద్యోగులు, ప్రభుత్వం ఓ కుటుంబంగా పనిచేసినప్పుడే నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకుంటామన్నారు. రాష్ట్రంలో అనేక […]</p>

X
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే తీపి కబురు చెబుతారని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ కలెక్టర్ గ్రౌండ్స్‌లో గురువారం టీఎన్‌జీఓల క్రీడోత్సవాలను నిర్వహించారు. వీటిని ప్రారంభించిన అనంతరం మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ పీఆర్సీ, వయస్సు పెంపుపై సీఎం కేసీఆర్ త్వరలోనే తీయని కబురు చెప్పనున్నారన్నారు. ఉద్యోగులు, ప్రభుత్వం ఓ కుటుంబంగా పనిచేసినప్పుడే నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకుంటామన్నారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళేది ఉద్యోగులేనని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మహాత్మా జ్యోతిబా పూలే రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
Next Story






